news

News May 12, 2024

ఢిల్లీ మెట్రో గోడలపై ఖలిస్థానీ నినాదాలు

image

ఎన్నికల వేళ ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థానీ నినాదాలు కనిపించడం కలకలం రేపింది. కరోల్‌భాగ్, ఝండేవాలన్ ప్రాంతాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. వెంటనే వాటిని చెరిపేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలోనూ మెట్రో స్టేషన్‌లో ఇలాంటి నినాదాలను దుండగులు రాశారు.

News May 12, 2024

ఒర్రీ ఛార్జ్.. ఫొటోకు రూ.25 లక్షలు

image

ఒర్రీ అలియాస్ ఓర్హన్ అవత్రమని.. బాలీవుడ్ స్టార్ నటులు, హీరోయిన్లతో ఫొటోలు దిగుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే అతడేమీ సరదా కోసం ఫొటోలు దిగడం లేదండోయ్. అలా చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారట. ఈ విషయాన్ని ఒర్రీ తాజాగా వెల్లడించారు. ‘నన్ను ఎవరైనా ఫొటో అడిగితే రూ.25 లక్షలు ఛార్జ్ చేస్తా. అదే టచ్ చేయమంటే ₹20 లక్షలు తీసుకుంటా. ఈ రెండూ రోజులో ఒకసారి మాత్రమే చేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో ఒర్రీ చెప్పారు.

News May 12, 2024

బుమ్రా ఖాతాలో మరో రికార్డు

image

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సీజన్లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 20 వికెట్లు పడగొట్టిన ఈ ముంబై ఇండియన్స్ బౌలర్.. 2017లో 20, 2020లో 27, 2021లో 21 వికెట్లు తీశారు. ఇక స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ 5 సార్లు ఈ ఘనత సాధించారు.

News May 12, 2024

కౌంట్‌డౌన్ మొదలు.. మరో 12 గంటలు..

image

మరో 12 గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలవనుంది. రెండు నెలల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలోని రెండు రాజకీయ వర్గాలు క్షణ క్షణం ఉత్కంఠగా పరిణామాలు గమనిస్తూ విశ్లేషిస్తున్నాయి. ఓటరు మనసు గెలిచేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నిస్తున్నాయి. అయిదేళ్ళ తర్వాత వచ్చిన అవకాశం వదులుకోవద్దు. తప్పక ఓటేయండి. ఎవరూ నచ్చలేదంటే నోటాకైనా వేయండి. మీ అభిప్రాయాన్ని నోటి మాటతో కాదు.. ఓటుతో చెప్పండి.
<<-se>>#VoteEyyiRaBabu<<>>

News May 12, 2024

ఆప్‌ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను: కేజ్రీవాల్

image

ఈ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే తాను తిరిగి జైలుకు వెళ్లే పరిస్థితి ఉండదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరో 20 రోజుల్లో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుందని చెప్పారు. తన పార్టీకి ఓటెయ్యాలని కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

News May 12, 2024

ఇంజినీరింగ్ విద్యార్థులకు SBI గుడ్ న్యూస్

image

ఇంజినీరింగ్ విద్యార్థులకు SBI గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో చేపట్టనున్న 12 వేల నియామకాల్లో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పిస్తామని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణనిచ్చి నియమించుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నియామకాలను సంస్థ చేపట్టనుంది. క్యాంపస్ నియామకాలు తగ్గిన సమయంలో SBI ప్రకటన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరటనివ్వనుంది.

News May 12, 2024

క్లీంకారతో ఉపాసన మొదటి మదర్స్ డే

image

మదర్స్ డేను హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ‘క్లీంకారతో నా మొదటి మదర్స్ డే అనుభవం అద్భుతంగా ఉంది. నా జీవితాన్ని చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. దీనికి కూతురు క్లీంకార, తల్లి శోభనాతో కలిసి దిగిన ఫొటోను జత చేశారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈ ఏడాది జనవరి 20న క్లీంకారకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

News May 12, 2024

1983 నుంచి వీరికే రికార్డ్ మెజార్టీ

image

2019: పులివెందుల – వై.ఎస్.జగన్ ☞90,110 (మెజార్టీ)
2014: పులివెందుల – వై.ఎస్.జగన్ ☞75,243
2009: పులివెందుల – వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ☞68,681
2004: కుప్పం – చంద్రబాబు నాయుడు ☞59,588
1999: కుప్పం – చంద్రబాబు నాయుడు ☞65,687
1994: పులివెందుల – వై.ఎస్.వివేకానంద రెడ్డి ☞71,580
1989: పులివెందుల – వై.ఎస్.వివేకానంద రెడ్డి ☞47,746
1985: జమ్మలమడుగు – శివారెడ్డి ☞57,170
1983: కాకినాడ – గోపాల కృష్ణమూర్తి ☞55,631

News May 12, 2024

IPL: లో స్కోరింగ్ మ్యాచులో CSK విజయం

image

ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో CSK విజయం సాధించింది. రాజస్థాన్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 142 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ 42*, రచిన్ 27, మిచెల్ 22, దూబే 18 రన్స్ చేశారు. RR బౌలర్లలో అశ్విన్ 2, బర్గర్, చాహల్ తలో వికెట్ తీశారు.

News May 12, 2024

టాస్ గెలిచిన DC.. RCB బ్యాటింగ్

image

బెంగళూరు వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
RCB: డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, రజత్ పాటీదార్, గ్రీన్, లోమ్రోర్, దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్
DC: మెక్‌గుర్క్, పోరెల్, హోప్, కుషాగ్రా, స్టబ్స్, అక్షర్, కుల్దీప్, రసిఖ్ దార్, ముకేశ్ కుమార్, ఇషాంత్, ఖలీల్