India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాల దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో విజయ్ దేవరకొండ ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ డ్యుయల్ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీలో రౌడీ బాయ్ తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నారు.
TS EAPCET ఫలితాలు ఈనెల 25న లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదల కోసం జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న ప్రారంభమైన EAPCET పరీక్షలు నిన్నటితో ముగిశాయి. గతేడాది మే 14న పరీక్షలు పూర్తవగా, అదే నెల 25న రిజల్ట్స్ వెల్లడించారు. దీంతో ఈసారి కూడా ఒకరోజు అటుఇటుగా ఫలితాలు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 2.40లక్షల మంది హాజరయ్యారు.
భారత్‌లోని సివిల్ సర్వీసులు, IAS వ్యవస్థలో నీతి, నిజాయతీ తగ్గుతోందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆరోపించారు. ఈ వ్యవస్థను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ఓ పుస్తకంలో IAS వ్యవస్థ ప్రక్షాళనపై తన అభిప్రాయాలను రాసుకొచ్చారు. ఏనాడో బ్రిటిషు వారు తయారు చేసిన IAS అనే స్టీల్ ఫ్రేమ్ ఇప్పుడు తుప్పుపట్టిందన్నారు. దీన్ని సరిచేసి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు.
TG: సీఎం రేవంత్‌తో తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. ‘రేవంత్ కారణంగానే మాదిగలకు ఎంపీ టికెట్ రాలేదు. దీంతో మాదిగలు 50ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. మాల సామాజిక వర్గం కంటే ఎక్కువ ఉన్నా ఒక్క టికెట్ కూడా మాకు కేటాయించలేదు. రేవంత్ అంటే ఏంటో కేవలం 100 రోజుల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. ప్రతిపక్షంలో ఉండగా అక్రమంగా రూ.కోట్లు సంపాదించుకున్నారు’ అని ఆరోపించారు.
IPLలో ఒకే సీజన్‌లో 400రన్స్, 15 వికెట్లు సాధించిన మూడో ప్లేయర్‌గా సునీల్ నరైన్(KKR) రికార్డు సృష్టించారు. గతంలో వాట్సన్(RR), కలిస్(KKR) ఈ ఫీట్ సాధించారు. ఇక IPLలో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లలో నరైన్(16) రెండో స్థానానికి చేరారు. 17 డకౌట్లతో DK, మ్యాక్స్‌వెల్, రోహిత్ తొలి స్థానంలో ఉన్నారు. అలాగే T20ల్లో 550W తీసిన మూడో ప్లేయర్‌గా నరైన్(550) నిలిచారు. బ్రావో(625), రషీద్(574) అతని కంటే ముందున్నారు.
AP ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి అసెంబ్లీకి అయితే, మరొకటి పార్లమెంట్‌కి. ముందుగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాతే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థికి ఓటు వేయాలి. ఈ రెండు బ్యాలట్ యూనిట్లు వేర్వేరుగా ఉంటాయి. అటూ ఇటూ కాకుండా.. పోటీ చేసే అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తు చూసి EVMలపై బటన్లు నొక్కండి.
☞ మీ భవిష్యత్తును మార్చే అభ్యర్థిని ఎన్నుకోండి.
☞ ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డుతో ప్రవేశించాలి
☞ జాబితాలో పేరుంటే ఓటేసేందుకు అనుమతి ఇస్తారు
☞ ఆ తర్వాత ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకు పూస్తారు
☞ ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసే ఛాంబర్‌కు వెళ్లాలి
☞ అప్పుడు పోలింగ్ అధికారి బ్యాలట్‌ను రిలీజ్ చేస్తారు. అక్కడ ఓటు వేశాక రెండో ఛాంబర్‌లో అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయాలి.
☞☞ నీ ఓటు సమయం 5 నిమిషాలే.. దాని విలువ 5 ఏళ్లు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు కుటుంబాలతో వెళ్తున్న వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రద్దీకి తగ్గట్లు బస్సులు లేక నిరీక్షించి నిరసించిపోతున్నారు. గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTCలు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. మీ EPIC నంబర్ లేదా పేరు, అడ్రస్‌తో రాష్ట్రం ఎంపిక చేసుకుని తెలుసుకోవచ్చు. మీ పేరు ఉంటే EPIC కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ <
☞☞ మే 13న జరిగే ఓట్ల పండుగలో మీరూ పాల్గొని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
TG: రాష్ట్రంలోని మారుమూల తండాలు, గూడేల్లోని ఓటర్ల కోసం ఈసీ ఈసారి 328 ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 61 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 100లోపే ఉంది. నాగర్ కర్నూల్ లోక్‌సభ పరిధి అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంటులోని మన్ననూరులో అతితక్కువగా 10 మంది ఓటర్లుండగా, ఉప్పునుంతల, బక్కలింగాయపల్లిలో అత్యధికంగా 100 మంది ఓటర్లు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.