news

News March 23, 2024

నాకు హైబీపీ ఉంది: కవిత

image

ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. తన మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడంలేదని కవిత పిటిషన్ వేశారు. తనకు హైబీపీ ఉందని, రిపోర్ట్స్ అడిగితే ఇవ్వడంలేదని తెలిపారు. మరోవైపు కాసేపట్లో కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. ఆమె కస్టడీ నేటితో ముగిసింది. మరో 3 రోజుల కస్టడీని కోరే అవకాశం ఉంది.

News March 23, 2024

డైరెక్షన్ చేయాలని ఉంది: సాయి పల్లవి

image

తనకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందంటూ హీరోయిన్ సాయిపల్లవి తన మనసులోని మాటను బయటపెట్టారు. తన అభిరుచికి తగ్గట్లు కథను రెడీ చేస్తోందట. అయితే అది ప్రస్తుతం ఆలోచన మాత్రమేనని.. సినిమాకు నిర్మాతలెవరో తెలియదని, తెలిశాక అందరికీ చెబుతానని పేర్కొంది. కాగా ప్రస్తుతం తండేల్ సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ తర్వాత అమిర్‌ఖాన్ కుమారుడు హీరోగా రూపొందుతున్న సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

News March 23, 2024

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్‌షాప్ ప్రారంభం

image

AP: వచ్చే 50 రోజుల ఎన్నికల ప్రణాళికపై టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేందుకు చంద్రబాబు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన నేతలు కూడా హాజరయ్యారు. ఎన్నికల నియమావళి, పోల్ మేనేజ్‌మెంట్, అభ్యర్థులకు ఉండే హక్కులు, ప్రచారం, నామినేషన్ల దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు సూచనలు చేస్తారు.

News March 23, 2024

బాంబు పేలుడు కేసులో నిందితుడి గుర్తింపు

image

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ముస్సావిర్ షాజిబ్‌గా తేల్చారు. అతడు కర్ణాటకలోని శివమొగ్గకు చెందినవాడని తెలిపారు. పేలుడు అనంతరం చెన్నైలో స్నేహితుడితో కలిసి ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. స్నేహితుడు కూడా తమిళనాడులోని ఓ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ ముద్దాయని తెలిపారు. మార్చి 1న బాంబు పేలుడు జరగ్గా ఈ కేసును NIA దర్యాప్తు చేస్తోంది.

News March 23, 2024

APPLY NOW: 2,253 ప్రభుత్వ ఉద్యోగాలు

image

ESICలో 2,253 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27తో ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 ఉద్యోగాలున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>https://upsc.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

News March 23, 2024

మహువా మొయిత్రా ఇళ్లు, కార్యాలయాలపై CBI దాడులు

image

డబ్బు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగిన కేసులో టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇళ్లలో సీబీఐ సోదాలు చేస్తోంది. కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆమె నివాసాలు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసులో ఆమెపై FIR నమోదు చేసి ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 23, 2024

కాసేపట్లో సీబీఐ ముందుకు సంధ్య ఆక్వా టెక్ ప్రతినిధులు

image

AP: విశాఖ డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణను ముమ్మరం చేసింది. కాసేపట్లో సంధ్య ఆక్వా టెక్ కంపెనీ ప్రతినిధులు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. ఈ కంపెనీ పేరుతోనే డ్రై ఈస్ట్ మాటున పెద్ద ఎత్తున బ్రెజిల్ నుంచి డ్రగ్స్ కంటెయినర్ వచ్చింది. ఇప్పటికే ఈమెయిల్స్, వాట్సాప్ వివరాలను సేకరించింది. నిన్న రాత్రి జడ్జి సమక్షంలో శాంపిల్స్ సేకరణను పూర్తి చేసింది. ఐసీసీ బ్రెజిల్ కంపెనీతో సీబీఐ సంప్రదింపులు చేస్తోంది.

News March 23, 2024

ఎర్త్ అవర్​ను ఎప్పుడు ప్రారంభించారో తెలుసా?

image

ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో ఒకరోజున <<12908046>>ఎర్త్ <<>>అవర్‌ను జరుపుకుంటారు. ఈ ఎర్త్ అవర్ అనే కాన్సెప్ట్‌ను తొలిసారి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రారంభించింది. ఇంధన, సంరక్షణ, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా కేవలం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమానికి WWF శ్రీకారం చుట్టింది. 2007 నుంచి ప్రపంచంలోని 7 వేల నగరాలు ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

News March 23, 2024

కిడ్నీ తీసుకుని లాలూ టికెట్ ఇచ్చారు: బిహార్ డిప్యూటీ సీఎం

image

బిహార్‌ డిప్యూటీ CM, BJP నేత సామ్రాట్ చౌదరీ RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘పార్టీ టికెట్లు అమ్మడంలో ఆరితేరిన లాలూ కుమార్తె రోహిణికీ మినహాయింపు ఇవ్వలేదు. ఆమె నుంచి కిడ్నీ తీసుకుని టికెట్ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని RJD కౌంటర్ ఇచ్చింది. లాలూ కుమార్తెకు టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతున్న వేళ సామ్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 23, 2024

జీవితకాల గరిష్ఠానికి దేశ ఫారెక్స్ నిల్వలు

image

మార్చి 15తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు జీవిత కాల గరిష్ఠ స్థాయి $642.292 బిలియన్లకు చేరుకున్నాయి. గత వారంతో పోలిస్తే $6.396 బిలియన్లు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇదే సమయంలో గోల్డ్ నిల్వల విలువ $425 మిలియన్లు పెరిగి $51.140 బిలియన్లకు చేరుకున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా 2022లో దేశ ఫారెక్స్ నిల్వలు $71 బిలియన్లు క్షీణించగా, 2023లో $58 బిలియన్లు పెరగడం విశేషం.