news

News May 9, 2024

ఈ ఆహార మార్గదర్శకాలు పాటించండి(1/2)

image

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్(ICMR) బృందం పౌరులకు ఆహార మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి పోషక అవసరాలను తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపింది. కాగా శరీరాకృతిని పెంచే ప్రొటీన్ సప్లిమెంట్స్‌ను దూరం పెట్టాలని సూచించింది. ప్రొటీన్ పౌడర్లు తీసుకోవడంతో ఎముకలతో పాటు కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరించింది. సమతుల్య ఆహారంలో మిల్లెట్లు, తృణధాన్యాల నుంచి 45 శాతం కేలరీలు అందేలా చూసుకోవాలంది.

News May 9, 2024

ఈ ఆహార మార్గదర్శకాలు పాటించండి(2/2)

image

మిగతా కేలరీలు కూరగాయాలు, పండ్లు, పాల నుంచి పొందాలని తెలిపింది. ఆహారంలో కొవ్వు శాతం 30 కంటే తక్కువగా ఉండాలని సూచించింది. దీంతో పాటు 5శాతానికి మించి చక్కెర ఉండకూడదని పేర్కొంది. ఏవైనా తినే పదార్థాలు కొనుగోలు చేసినప్పుడు వాటిపై ఉండే లేబుల్స్ చదవాలని తెలిపింది. అవసరమైన పోషకాలను తక్కువ సంఖ్యలో తీసుకోవడం యువతలో జీవక్రియకు అంతరాయం కలిగించడమే కాకుండా అనుబంధ వ్యాధులను పెంచుతుందని వెల్లడించింది.

News May 9, 2024

ఓట్ల పండగకు ఆహ్వానం

image

ఎన్నికల మహోత్సవానికి రండి.. రారండి అంటూ ముద్రించిన ఆహ్వాన పత్రిక వైరలవుతోంది. ‘ఐదేళ్లకోసారి జరిగే ఈ మహోత్సవంలో అందరూ పాల్గొని నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరముంది. 13న ఉ.6 నుంచి సా.5 గంటల వరకు మీ పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఓటేయండి. విందులో ఫ్రూట్స్, బిస్కెట్స్ వంటివి ఉంటాయి. లేదంటే ఇంట్లోనే తినిరండి’ అని అందులో రాసి ఉంది. పత్రికలో భవదీయులు.. ‘తలరాతను మార్చే శక్తి ఈ ఓటు’ అని ఉండటం విశేషం.

News May 9, 2024

ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా: వాట్సన్

image

టీమ్ఇండియాకు కోచ్‌గా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తెలిపారు. ‘నాకు కోచింగ్ ఇవ్వడమంటే ఇష్టం. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ప‌ని చేస్తున్నా. PSL, MLS లీగుల్లోనూ సేవ‌లందిస్తున్నా. గొప్ప ఆట‌గాళ్ల‌తో ప‌నిచేయడమంటే నాకు చాలా ఇష్టం. అందుకు టీమ్ఇండియా బాగా స‌రిపోతుంది. భవిష్యత్తులో అవకాశం వస్తే కోచ్‌గా పనిచేస్తా’ అని వాట్సన్ మనసులో మాటను బయటపెట్టారు.

News May 9, 2024

నా జీవితంలో తప్పు చేయలేదు: చంద్రబాబు

image

AP: జైలులో ఉన్నప్పుడు తనను చంపేందుకు ప్రయత్నించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించారన్నారు. విశాఖ సభలో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో తప్పు చేయలేదు.. అందుకే భయపడను. రాజకీయ రౌడీలను వదిలిపెట్టేది లేదు. వైసీపీ నేతలు వైజాగ్‌లో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారు. ఇక్కడి ప్రజలు ఎంతో ముందుచూపుతో 2014లో విజయమ్మను ఓడించారు’ అని పేర్కొన్నారు.

News May 9, 2024

పెళ్లి తర్వాత సహజీవనాన్ని ఇస్లాం ఒప్పుకోదు: హైకోర్టు

image

సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లి తర్వాత లివ్ఇన్ రిలేషన్‌ను ఇస్లాం అంగీకరించదు. అవివాహితులు, అడల్ట్స్ అయితే వారిష్టమొచ్చినట్లు జీవించవచ్చు’ అని పేర్కొంది. సహజీవనం చేస్తున్న తమకు పోలీస్ రక్షణ కావాలంటూ షాదాబ్- స్నేహా దేవి కోర్టును ఆశ్రయించారు. అయితే షాదాబ్‌కు వివాహమై, కూతురు కూడా ఉందని విచారణలో తేలింది. దీంతో కోర్టు ఆ యువతిని పేరెంట్స్ వద్దకు పంపాలని పోలీసులను ఆదేశించింది.

News May 9, 2024

ప్చ్.. వర్షంతో నిలిచిన మ్యాచ్

image

ధర్మశాల వేదికగా బెంగళూరు, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ నిలిచిపోయింది. 10ఓవర్లు ముగియగానే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ని నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 10 ఓవర్లకు RCB 3 వికెట్లు కోల్పోయి 119 రన్స్ చేసింది. క్రీజులో కోహ్లీ(42), గ్రీన్(0) ఉన్నారు. కాగా.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో RCB తప్పక గెలవాల్సి ఉంది. వర్షం తగ్గాలని RCB ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News May 9, 2024

టీవీల్లోనూ అదరగొట్టిన ‘హనుమాన్’

image

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా థియేటర్లు, ఓటీటీతోపాటు టీవీల్లోనూ అదరగొట్టింది. గత నెల 28న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారమైన ఈ చిత్రం 10.26 TRPని సాధించింది. ఆదికేశవ(10.47) తర్వాత ఇటీవల కాలంలో రెండంకెల TRPని సాధించిన మూవీ ఇదేనని తెలుస్తోంది. సలార్, గుంటూరు కారం, భగవంత్ కేసరి, నా సామిరంగ లాంటి చిత్రాలకు సింగిల్ డిజిట్ TRP వచ్చింది.

News May 9, 2024

కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న కేఎల్?

image

SRH చేతిలో భారీ ఓటమి తర్వాత LSGలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది. లీగ్ దశలో చివరి 2 మ్యాచ్‌లకు KL రాహుల్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే 2025 IPL సీజన్‌కు KLను ఫ్రాంఛైజీ వదులుకోనున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా నిన్న రాహుల్‌పై లక్నో ఓనర్ <<13210793>>ఆగ్రహం<<>> వ్యక్తం చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు.

News May 9, 2024

మేమూ హిందువులమే.. కానీ.. : పద్మారావు

image

TG: తామూ హిందువులమేనని, కానీ.. రాముడి పేరుతో రాజకీయాలు చేయబోమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. బీజేపీలా రాముడి పేరుతో ఓట్లు అడుక్కోనని చెప్పుకొచ్చారు. ఆ పార్టీ ఇంకెన్ని రోజులు రాముడి పేరుతో ఓట్లు అడుక్కుంటుందని ఆయన ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా ఉన్నందుకే కవితను జైలుకు పంపించారని ఆయన అన్నారు.