news

News October 29, 2024

MICROSOFT, GOOGLE డిష్యూం.. డిష్యూం

image

ప్రపంచంలోనే 2 అతిపెద్ద టెక్ కంపెనీలు బహిరంగ విమర్శలకు దిగాయి. తమ క్లౌడ్ బిజినెస్ Azureను దెబ్బకొట్టేందుకు గూగుల్ షాడో క్యాంపెయిన్ చేస్తోందని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. ఇందుకు ఓ యూరోపియన్ లాబీయింగ్ టీమ్‌తో జట్టు కట్టినట్టు తెలిపింది. సెప్టెంబర్లో EU రెగ్యులేటర్స్ వద్ద మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ యాంటీట్రస్ట్ కంప్లైంట్ ఇచ్చింది. అక్రమ లైసెన్సింగ్ ప్రాక్టీసెస్ చేస్తోందని ఆరోపించింది. ఇది అగ్గి రాజేసింది.

News October 29, 2024

జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదు: జగదీశ్ రెడ్డి

image

TG: ప్రభుత్వ తీరుతో ఇంట్లో దావత్ చేసుకోవాలన్నా ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తమను జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదని మండిపడ్డారు. కేసీఆర్, మా ఇంటి మీద బాంబులు వేసి చంపుతారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో కొట్లాడి విద్యుత్ బాంబును ఆపేశామన్నారు. రోడ్ల ప్రైవేటైజేషన్ బాంబును కూడా ఆపి, ప్రజలను రక్షిస్తామని చెప్పారు.

News October 29, 2024

శిల్పాశెట్టి రెస్టారెంట్లో రూ.80లక్షల కారు చోరీ

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్‌లో ఖరీదైన కారు మాయం కావడం చర్చనీయాంశమైంది. ముంబైలో దాదర్ వెస్ట్‌లోని కోహినూర్ స్క్వేర్‌ 48వ అంతస్తులో ఉన్న బాస్టియన్ ఎట్ ది టాప్ రెస్టారెంట్‌కు ఓ కస్టమర్ వచ్చారు. రూ.80లక్షల ఖరీదైన BMW Z4 కారును పార్క్ చేయమని రెస్టారెంట్ సిబ్బందికి కీస్ ఇచ్చారు. 1amకి భోజనం చేసి వచ్చేలోపు ఆ కారు మాయమైంది. ఇద్దరు దుండగులు కారు ఎత్తుకెళ్లినట్లు CCTV ఫుటేజ్‌లో తేలింది.

News October 29, 2024

బీఆర్ఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తాం: బండి సంజయ్

image

TG: బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు మధ్య పంచాయితీ నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు. బీఆర్ఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను ఇబ్బంది పెడితే కాంగ్రెస్‌ను వేటాడుతామని హెచ్చరించారు.

News October 29, 2024

షరియత్ కౌన్సిల్ విడాకుల సర్టిఫికెట్ ఇవ్వడం షాకింగ్: మద్రాస్ హైకోర్టు

image

షరియత్ కౌన్సిల్ ప్రైవేటు సంస్థ అని, అది మంజూరు చేసే విడాకులు చెల్లవని మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ తెలిపింది. వారు విడాకుల సర్టిఫికెట్ ఇవ్వడం షాకింగ్‌గా ఉందంది. అక్కడ ట్రిపుల్ తలాక్ చెప్పినప్పటికీ వివాహం మనుగడలో ఉన్నట్టేనని స్పష్టం చేసింది. తలాక్‌ను అంగీకరించని భార్యకు రూ.5L పరిహారం, నెలకు రూ.25వేలు చెల్లించాలని తిరునెల్వేలి కోర్టు 2021లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భర్త హైకోర్టుకు వెళ్లారు.

News October 29, 2024

ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు.. KTR సంచలన ట్వీట్

image

TG: 2 రోజులుగా జరుగుతుంది కేవలం ఆరంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని BRS కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులను ఉద్దేశిస్తూ KTR ట్వీట్ చేశారు. ‘త్వరలో మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం. BJP, కాంగ్రెస్, TDP పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వవద్దు’ అని KTR ట్వీట్ చేశారు.

News October 29, 2024

ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. ఇలా బుక్ చేసుకోండి

image

AP: పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఆయిల్ కంపెనీ యాప్‌లోనూ అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది. బుక్ చేయగానే లింక్ అయిన నంబర్‌కు మెసేజ్ వస్తుంది. సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.

News October 29, 2024

BREAKING: ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం

image

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి బుకింగ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లుండి నుంచి అమలయ్యే ఈ పథకానికి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయనుంది. తొలి విడత చెల్లింపుల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.895 కోట్లు విడుదల చేసింది. DBT విధానంలో ఉచిత సిలిండర్ నగదును ఖాతాలో జమచేయనుంది.

News October 29, 2024

పల్లె రోడ్లకు మహర్దశ!

image

TG: రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో గ్రామాల్లో 17,300km మేర రోడ్లను ppp మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి ఏడాది 4,000-5,000km రోడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది. పంచాయతీరాజ్ విభాగం కింద బీటీ రోడ్లు 26146.83km, WBM రోడ్లు 7752.10km, సీసీ రోడ్లు 4146.63km, మట్టిరోడ్లు 30493.72km మేర వేయనుంది. దీనికి మొత్తంగా రూ.12,000కోట్లు ఖర్చు కానుందని అంచనా.

News October 29, 2024

బిగ్ బీ, చిరుకు థాంక్స్ చెప్పిన నాగార్జున

image

ANR నేషనల్ అవార్డ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు, అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ‘లివింగ్ లెజెండ్స్ బచ్చన్, చిరు ANR శత జయంతి వేడుకలకు హాజరై మరపురాని జ్ఞాపకాలను అందించారు. మీ రాకతో ఈ వేడుక మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది. నాన్నగారి జీవితానికి సంబంధించి కీరవాణి చేసిన ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ట్వీట్ చేశారు.