news

News May 10, 2024

అప్పటి నుంచీ ప్రతిరోజూ యుద్ధమే: ఖలీల్

image

ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఖలీల్ అహ్మద్ 2019 నవంబరులో చివరిగా భారత్ తరఫున ఆడారు. ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఇన్నేళ్లకు మళ్లీ టీమ్ ఇండియా తరఫున వరల్డ్ కప్‌నకు ఎంపికయ్యారు. ‘గత నాలుగున్నరేళ్లుగా చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటి నుంచి మానసికంగా ప్రతిరోజూ ఒక యుద్ధమే చేశాను. మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతోనే ఉన్నా. ఇన్నేళ్లకు భారత జట్టులో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకో ముందడుగు’ అని తెలిపారు.

News May 10, 2024

4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో మరో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 12, 13, 14 తేదీల్లో వర్షాలు కురిసే జిల్లాల జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News May 10, 2024

రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రాభివృద్ధిని గాడిద గుడ్డుతో పోల్చేందుకు సిగ్గుండాలంటూ సీఎం రేవంత్‌‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ‘రేవంత్ తలపై గాడిదగుడ్డుతో సభలకు వెళ్తున్నారు. సిగ్గుండాలి. రాష్ట్రం కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తే సీఎం దాన్ని గాడిదగుడ్డుతో పోలుస్తున్నారు. మేం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. రేవంత్ మిడిమిడి జ్ఞానంతో బీజేపీని విమర్శిస్తున్నారు’ అని మండిపడ్డారు.

News May 10, 2024

సీఎం రేవంత్‌కు ఈసీ నోటీసులు

image

TG: కేసీఆర్‌పై దూషణలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా కేసీఆర్‌ను దూషించినందుకు, అసభ్యపదజాలం వాడిన ఘటనలపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో సీఎంకు ఈ నోటీసులు పంపింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్‌కు ఈసీ స్పష్టం చేసింది.

News May 10, 2024

TGలో రైతు భరోసాకు ఎలా అనుమతిచ్చారు?: హైకోర్టు

image

AP: ఎన్నికల నిర్వహణపై ఒక్కో రాష్ట్రానికి వేర్వేరుగా ప్రమాణాలు ఎందుకని ఈసీని హైకోర్టు ప్రశ్నించింది. ‘TGలో రైతు భరోసాకు ఎలా అనుమతిచ్చారు? APలో పథకాలను ఏవిధంగా అడ్డుకుంటున్నారు? 2019లో పసుపు-కుంకుమకు అనుమతి ఇచ్చినప్పుడు అనుసరించిన నియమాలను ఇప్పుడు పాటించడం లేదని స్పష్టమవుతోంది’ అని పేర్కొంది. నిధుల విడుదలకు ఇక సమయం లేనందున ఎన్నికల తర్వాతే జమ చేయాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

News May 10, 2024

రెచ్చగొట్టడమే రాజకీయమా?

image

నాయకులు తామేం చేశారో, ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. కానీ.. ప్రస్తుతం తెలంగాణలో కొందరు అలా చేయడం లేదు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పర్యవసానాల గురించి ఆలోచించట్లేదు. గతంలో MIM నేత అక్బరుద్దీన్ ‘పోలీసులు పక్కకు జరగండి మాకు 15నిమిషాలు చాలు’ అని నోరు జారితే.. తాజాగా దానికి కౌంటరిస్తూ ‘మాకు 15సెకన్లు చాలు’ అంటూ BJP లీడర్ నవనీత్ కౌర్ అన్నారు. దీనిపై మీ కామెంట్?

News May 10, 2024

IPL: టాస్ గెలిచిన చెన్నై

image

గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కెప్టెన్ రుతురాజ్ బౌలింగ్ ఎంచుకున్నారు.
చెన్నై: రుతురాజ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, దూబే, మొయిన్ అలీ, జడేజా, ధోనీ, సాంట్నర్, సిమర్‌జీత్ సింగ్, శార్దూల్, తుషార్ దేశ్‌పాండే
గుజరాత్: గిల్, సాయి సుదర్శన్, షారుక్, మిల్లర్, మాథ్యూ వేడ్, తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్

News May 10, 2024

పల్నాడులో రక్తచరిత్ర సృష్టించారు: చంద్రబాబు

image

AP: పల్నాడు ప్రాంతాన్ని YCP పాలనలో రక్తంతో తడిపేశారని TDP అధినేత చంద్రబాబు ఆరోపించారు. వాతావరణం అనుకూలించక మాచర్ల సభకు వెళ్లలేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. ‘పైరుపంటలతో పచ్చగా ఉండాల్సిన పల్నాడును నాశనం చేశారు. MLA పిన్నెల్లి హత్యా రాజకీయాలు చేశారు. ఆయన పద్ధతి మార్చుకోవాలి. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. మేం గెలిచాక ఫ్యాక్షన్ రాజకీయాలను పూర్తిగా అణచివేస్తాం’ అని స్పష్టం చేశారు.

News May 10, 2024

అందుకే పెళ్లి చేసుకోలేదు: కోవై సరళ

image

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అనేక వైవిధ్యమైన పాత్రల్ని చేశారు కోవై సరళ. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం వెనుక కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పెళ్లి చేసుకోవాలన్న రూలేం లేదు కదా. స్వేచ్ఛగా ఉండాలనే చేసుకోలేదు. మరీ బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్, షిరిడీ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటాను. ఒంటరిగా భూమ్మీదకు వచ్చాం. ఆ తర్వాతేగా బంధాలు ఏర్పడ్డాయి. ఒకరిమీద ఆధారపడి బతకాలని నేను అనుకోను’ అని వివరించారు.

News May 10, 2024

బీజేపీ ఇవ్వకపోతే ఇవన్నీ ఎవరు ఇచ్చారు?: మోదీ

image

తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులను కాంగ్రెస్ నేతలు ATMగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘4 వందే భారత్ రైళ్లు తెలంగాణకు ఎవరు ఇచ్చారు? తొలి ఎయిమ్స్, ఫర్టిలైజర్స్ పరిశ్రమ, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఎవరు ఇచ్చారు? తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటోంది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీ నినాదం’ అని మోదీ పేర్కొన్నారు.