India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మలయాళ హీరోయిన్ <<12877028>>అరుంధతి<<>> నాయర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని, పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆర్థిక సాయం కోరుతూ పలువురు స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈమె తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. విజయ్ ఆంటోనీ ‘భేతాళుడు’ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్ పనిచేయట్లేదని కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘ఉదయాన్నే మొబైల్‌లో ఇన్‌స్టా ఓపెన్ చేయగానే లాగౌట్ అయింది. తిరిగి ప్రయత్నిస్తే పాస్‌వర్డ్ చేంజ్ చేశారని నోటిఫికేషన్ వచ్చింది. మళ్లీ ప్రయత్నిస్తే అసలు తమ అకౌంటే లేదని చూపిస్తోంది’ అని పోస్టులు పెడుతున్నారు. దీంతో INSTAGRAM DOWN హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీకూ ఇలానే అవుతోందా? కామెంట్ చేయండి.
TG: ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
☛ ఫ్యూచర్ గేమింగ్&హోటల్ సర్వీసెస్-₹150కోట్లు
☛ మేఘా ఇంజినీరింగ్ – ₹37కోట్లు
☛ ద రామ్‌కో సిమెంట్స్ – ₹24కోట్లు
☛ ఓస్ట్రో మాధ్య విండ్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹17కోట్లు
☛ ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹17కోట్లు
☛ స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ – ₹10కోట్లు
☛ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- ₹40కోట్లు
☛ మేఘా ఇంజినీరింగ్ – ₹28కోట్లు
☛ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ – ₹20కోట్లు
☛ నాట్కో ఫార్మా – ₹14కోట్లు
☛ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్- ₹13కోట్లు
☛ భారత్ బయోటెక్ – ₹10కోట్లు
TG: అలంపూర్ BRS MLA విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తదుపరి విచారణను APR 18కి వాయిదా వేసింది. ‘పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాల్లో తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదు. ఈసీ రూల్స్‌కు ఇది విరుద్ధం. ఆయన ఎన్నిక చెల్లదు’ అని BSP అభ్యర్థి ప్రసన్న కోర్టును ఆశ్రయించారు.
AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి మే 2 నుంచి 5 వరకు APRCET నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు తెలిపారు. ఈ నెల 19తోనే దరఖాస్తు గడువు ముగియగా, ఈ నెల 29 వరకు రూ.2వేలు, ఏప్రిల్ 6 వరకు రూ.5వేల అపరాధ రుసుముతో అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ డేటాలో యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీకి రూ.94 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తేలింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ముందు కూడా విరాళం ఇచ్చింది. కాగా ‘MEIL’ రూ.195 కోట్లు, చెన్నై గ్రీన్‌వుడ్స్ ప్రై. లిమిటెడ్ రూ.50 కోట్లు, డా. రెడ్డీస్ ల్యాబ్స్ రూ.32 కోట్లు, హెటిరో డ్రగ్స్ రూ.30 కోట్లు, హెటిరో ల్యాబ్స్ రూ.20 కోట్లు, DIVIS ల్యాబ్స్ రూ.20 కోట్లు BRSకి అందించాయి.
AP: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించి తీరుతామని సిట్టింగ్ MLA పెండెం దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. YCP అభ్యర్థి వంగా గీతను గెలిపించుకొని సీఎం జగన్ వద్దకు వస్తానని తెలిపారు. సీఎంతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘పొత్తులతో టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ బొమ్మను చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ వైసీపీనే గెలుచుకుంటుంది’ అని తేల్చిచెప్పారు.
TG: రైతుబంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.