News September 7, 2024
దేశవాళీలో DRS.. బీసీసీఐ భేష్: అశ్విన్
ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో బీసీసీఐ DRSను తీసుకురావడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. దీని వల్ల దేశవాళీ క్రికెట్‌లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. యువ క్రికెటర్లు సైతం తమ తప్పుల్ని తెలుసుకుని తమను తాము మెరుగుపరుచుకుంటారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రికీ భుయ్ తాజాగా ఔటైన విధానాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు.
Similar News
News October 12, 2024
ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ITBPలో 545 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10% ఖాళీలను ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. టెన్త్ పాసైన 21 నుంచి 27 ఏళ్లు వారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి ₹21,700-69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. ఫీజు ₹100. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News October 12, 2024
లుంగీలు, దుప్పట్ల సాయంతో జైలు నుంచి జంప్!
అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 12, 2024
అమ్మవారికి తల సమర్పించేందుకు భక్తుడి యత్నం!
దుర్గమ్మకు ఓ భక్తుడు ఏకంగా తలనే సమర్పించాలనుకున్న ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని ‘మా బీజాసన్’ గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్‌తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 9 రోజుల పాటు ఉపవాసం ఉండి తల ఇచ్చేందుకు ఆలయానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.