news

News September 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 8, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 08, ఆదివారం
శు.పంచమి: రా.7.58 గంటలకు
స్వాతి: మ.3.30 గంటలకు
వర్జ్యం: రా.9.42-రా.11.28 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.5.24 గంటల వరకు

News September 8, 2024

ఆర్మీ వాళ్లే వెళ్లలేకపోతే వాలంటీర్లు వెళ్తారా?: టీడీపీ

image

AP: విజయవాడలో వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది వెళ్లలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, అలాంటప్పుడు వాలంటీర్లు ఎలా వెళ్తారని వైసీపీని టీడీపీ ప్రశ్నించింది. ప్రభుత్వంపై బురద జల్లడం ఆపి, వాస్తవిక ప్రపంచంలో బతకాలని ట్వీట్ చేసింది. ‘వేల మంది ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొంటే జగన్‌కు కనిపించదు. ఒక మాజీ సీఎంలా ప్రవర్తించు. హుందాగా ఉంటుంది’ అని మండిపడింది.

News September 8, 2024

నేటి ముఖ్యాంశాలు

image

*AP: వరద బాధితులను చూస్తే గుండె తరుక్కుపోతోంది: చంద్రబాబు
* బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తి: మంత్రి నిమ్మల
* వరద వచ్చి 8 రోజులైనా ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి: జగన్
* TG: పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి ప్రభుత్వం నజరానా
* ఖమ్మంలో భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
* కాంగ్రెస్ ఘనతను వర్ణించడానికి మాటలు రావట్లేదు: KTR సెటైర్

News September 7, 2024

ర‌జ‌నీకాంత్ కామెంట్స్‌పై రాధిక స్పంద‌న‌

image

మాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన జ‌స్టిస్ హేమా క‌మిటీ నివేదిక గురించి త‌న‌కు తెలియ‌ద‌ని ర‌జ‌నీకాంత్ వ్యాఖ్యానించ‌డంపై న‌టి రాధిక స్పందించారు. క‌మిటీ నివేదిక‌పై ఆయ‌న‌కు ఎవ‌రూ చెప్పి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, ఒక‌వేళ ఆయ‌న‌కు తెలిసివుంటే స్పందించేవార‌ని రాధిక పేర్కొన్నారు. మ‌హిళా ఆర్టిస్టుల‌పై వేధింపుల విష‌యంలో స‌హ‌చ‌ర న‌టులు మౌనంగా ఉండ‌డంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించాలని సూచించారు.

News September 7, 2024

హై అలర్ట్.. వరదలపై ప్రభుత్వం WARNING

image

విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉందని, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బుడమేరు గండ్లను పూడ్చివేయడం వల్ల కొత్తగా అక్కడికి వరద నీరు చేరడం లేదని, అయినా వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు ఖమ్మం పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.

News September 7, 2024

రేపే యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్

image

US ఓపెన్ టెన్నిస్ పురుషుల‌ ఫైన‌ల్స్ ఆదివారం జ‌ర‌గ‌నుంది. అమెరికాకు చెందిన 26 ఏళ్ల టేలర్ ఫ్రిట్జ్ టైటిల్ గెలిచిన రెండో అమెరిక‌న్‌గా నిలుస్తాడా? లేదా 23 ఏళ్ల ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్‌ ఇట‌లీ స్టార్ జ‌న్నిక్ సిన్న‌ర్ టైటిల్ గెలిచి చ‌రిత్ర సృష్టిస్తాడా? అన్న‌ది రేపు తేల‌నుంది. మ‌ణిక‌ట్టు గాయాన్ని సైతం లెక్క చేయ‌కుండా సిన్న‌ర్ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచినా అది చ‌రిత్రే.

News September 7, 2024

సచివాలయాలు, వాలంటీర్లు ఉండి ఉంటే..: జగన్

image

CM చంద్రబాబు ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో సమన్వయ లోపం నెలకొందని YS జగన్ ట్వీట్ చేశారు. ‘మీకూ, మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. వర్షాలు ఆగి 5 రోజులు అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు.

News September 7, 2024

జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు: జగన్

image

AP: చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని YS జగన్ విమర్శించారు. ‘ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు, వరదలు వస్తాయని 28నే మీకు అలర్ట్ వచ్చింది. కృష్ణాపై ఉన్న జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు. ఉన్నతాధికారులతో రివ్యూ చేసి బాధ్యతలు అప్పగించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా? బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం వల్ల ఇంత విపత్తుకు దారితీసింది’ అని ట్వీట్ చేశారు.

News September 7, 2024

త్వరలో గంటకి 250 కిమీ వేగంతో నడిచే రైళ్లు!

image

రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గంట‌కు 250 KM వేగంతో న‌డిచే 2 రైళ్ల రూప‌క‌ల్ప‌న‌, త‌యారీకి బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్‌లో 2 స్టాండర్డ్ గేజ్ రైళ్ల త‌యారీకి రైల్వే శాఖ‌ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి లేఖ రాసింది. 8 కోచ్‌లు ఉండేలా ఉక్కుతో త‌యారై 220 KM రన్నింగ్ సామర్థ్యంతో గరిష్ఠంగా 250 KMPH వేగం కలిగి ఉండాలని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం వందే భారత్ 160 KMPH వేగంతో నడవగలవు.