News September 8, 2024

నేటి ముఖ్యాంశాలు

image

*AP: వరద బాధితులను చూస్తే గుండె తరుక్కుపోతోంది: చంద్రబాబు
* బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తి: మంత్రి నిమ్మల
* వరద వచ్చి 8 రోజులైనా ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి: జగన్
* TG: పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి ప్రభుత్వం నజరానా
* ఖమ్మంలో భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
* కాంగ్రెస్ ఘనతను వర్ణించడానికి మాటలు రావట్లేదు: KTR సెటైర్

Similar News

News October 15, 2024

కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్

image

TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్‌లను అరెస్ట్ చేశారు.

News October 15, 2024

GREAT: తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్‌గా మారింది

image

సినిమా స్టోరీని తలదన్నేలా తన తండ్రిని చంపిన వ్యక్తిని శిక్షించడం కోసం ఓ మహిళ పోలీస్‌గా మారిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. గిస్లేనే సిల్వా(35) అనే మహిళ తండ్రి జోస్ విసెంటేను 1999లో స్నేహితుడు రైముండే హత్య చేశాడు. 2013లో శిక్ష పడినా తప్పించుకున్నాడు. ఈ పరిణామాలు చూస్తూ పెరిగిన సిల్వా లా చదివారు. తర్వాత పోలీసుగా మారారు. ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

News October 15, 2024

EVMల బ్యాట‌రీ కాలిక్యులేట‌ర్ బ్యాట‌రీ లాంటిది: CEC

image

EVMల బ్యాట‌రీ కాలిక్యులేట‌ర్ల‌ బ్యాట‌రీ లాంటిద‌ని CEC రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. లెబ‌నాన్‌కు చెందిన హెజ్బొల్లా పేజర్ల‌ను ఇజ్రాయెల్ పేల్చ‌గ‌లిగిన‌ప్పుడు, మ‌న EVMల ప‌రిస్థితేంట‌ని కాంగ్రెస్ ప్రశ్నించడంపై ఆయన స్పందించారు. ఈవీఎంల‌లో కాలిక్యులేట‌ర్ లాంటి సింగిల్ యూజ్ బ్యాట‌రీ ఉంటుందని, అది మొబైల్ బ్యాట‌రీ కాద‌ని పేర్కొన్నారు. ఈవీఎంల బ్యాట‌రీల‌కు మూడంచెల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఉంటుంద‌ని వివరించారు.