news

News May 11, 2024

రేవంత్‌ను సర్జికల్ స్ట్రైక్ ప్రాంతానికి పంపాలి: మాధవీలత

image

సర్జికల్ స్ట్రైక్ జరిగిన ప్రాంతానికి సీఎం రేవంత్‌రెడ్డిని పంపించాలని HYD బీజేపీ MP అభ్యర్థి మాధవీలత అన్నారు. అప్పుడైనా రేవంత్‌కు సర్జికల్ స్ట్రైక్ నిజంగా జరిగిందా? లేదా? అనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికల కోసమే సర్జికల్ స్ట్రైక్ పేరుతో మోదీ నాటకమాడారన్న రేవంత్ విమర్శలకు స్పందనగా మాధవీలత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. రేవంత్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.

News May 11, 2024

నేను ఓడిపోతానని ముందే తెలుసు: ఎర్రబెల్లి

image

TG: అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ‘ఎన్నికలకు 3 నెలల ముందే సీటు మార్చాలని కేసీఆర్‌ను కోరా. బీఆర్ఎస్‌కు 40 సీట్లు మాత్రమే వస్తాయని, మరో 20 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని కూడా చెప్పా. ప్రజల అభిప్రాయం నాకు తెలుసు’ అని ఎర్రబెల్లి వెల్లడించారు. కాగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

News May 11, 2024

ఎంత కష్టమైనా పోలింగ్ బూతుకెళ్లి ఓటేయండి: హీరో నిఖిల్

image

ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు ఓటింగ్ పర్సంటేజ్ నమోదుకావాలని హీరో నిఖిల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని గ్రామాలకు వెళ్లే అన్ని రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎంత కష్టమైనా సరే మీ పోలింగ్ బూతుకి చేరుకొని ఓటేసి మీ స్వరాన్ని వినిపించాలని అభ్యర్థిస్తున్నా. ఓటింగ్ శాతంలో రికార్డులు నమోదవ్వాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

News May 11, 2024

YSR పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ చేర్చలేదు: రాహుల్

image

AP: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కడప సభలో ఆయన మాట్లాడుతూ.. ‘విభజన సమయంలో APకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తాం. CBI ఛార్జిషీటులో YSR పేరుని కాంగ్రెస్ చేర్చలేదు. కొందరు స్వలాభం కోసం ఇలా ప్రచారం చేస్తున్నారు. YSR సిద్ధాంతాలు పార్లమెంట్‌లో వినిపించాలంటే షర్మిలను గెలిపించాలి’ అని కోరారు.

News May 11, 2024

తెనాలిలో తండ్రి, కూతురు, మనమరాలు గెలుపు!

image

గుంటూరు(D) తెనాలి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి రాజకీయాల్లో ఓ కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952,55,62లో ఆలపాటి వెంకట రామయ్య MLAగా గెలుపొందగా.. ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా 1967, 72, 78 ఎన్నికల్లో విజయం సాధించారు. వారి తదనంతరం 1999లో ఆలపాటి మనమరాలు గోగినేని ఉమ MLAగా నెగ్గి.. ఎక్కువ మంది MLAలున్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు. <<-se>>#ELECTIONS2024<<>>

News May 11, 2024

ఇక వడగాల్పులు ఉండవు: IMD

image

ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని తెలిపింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించింది.

News May 11, 2024

అటు ఐకాన్ స్టార్.. ఇటు గ్లోబల్ స్టార్

image

ఏపీ ఎన్నికల్లో ‘మెగా ఫ్యామిలీ’ మార్క్ కనిపిస్తోంది. ప్రచారానికి చివరిరోజు కావడంతో ఇవాళ పవన్ కళ్యాణ్‌కు మద్దతిచ్చేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. మరోవైపు తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల చేరుకున్నారు. అయితే మొన్న పవన్‌కు సప్పోర్ట్‌గా ట్వీట్ చేసిన బన్నీ.. ఈ రోజు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతివ్వడం గమనార్హం.

News May 11, 2024

భారత్ జోడో యాత్రకు వైఎస్సారే స్ఫూర్తి: రాహుల్

image

AP: వైఎస్సార్ తనకు తండ్రిలా మార్గనిర్దేశం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కడప సభలో తెలిపారు. ‘రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ముల్లా ఉండేవారు. వైఎస్సార్ ఏపీకే కాదు మొత్తం దేశానికే దారి చూపించారు. నా భారత్ జోడో పాదయాత్రకు ఆయనే స్ఫూర్తి. దేశమంతా పాదయాత్ర చేయాలని, అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్సారే నాకు చెప్పారు’ అని రాహుల్ గుర్తు చేసుకున్నారు.

News May 11, 2024

ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకునేందుకు యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే

image

* కొత్త ఐఓఎస్ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
* ఫోన్‌ను ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతల వద్దే ఉంచాలి. 35°C కంటే ఎక్కువ వేడి తగిలితే బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది.
* ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ కేసు/పౌచ్ తీసేయాలి.
* కొన్ని రోజులు ఫోన్ వాడొద్దు అనుకున్నప్పుడు 50% ఛార్జింగ్‌తో స్టోర్ చేయడం మంచిది.
* ఛార్జింగ్ చాలా తక్కువ ఉంటే ‘లో పవర్ మోడ్‌’ను యాక్టివేట్ చేసుకోవాలి.

News May 11, 2024

కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది: అమిత్ షా

image

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదని అమిత్ షా విమర్శించారు. ‘ఉగ్రవాదులను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. దేశంలో ఉగ్రవాదాన్ని పారదోలడానికి మోదీ కృషి చేశారు. అయోధ్యలో రామమందిరం అంశాన్ని కాంగ్రెస్ 70ఏళ్లుగా నాన్చుతూ వచ్చింది. మోదీ రెండోసారి PM కాగానే ఐదేళ్లలో ఆలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్, మజ్లిస్‌ను రాష్ట్రం నుంచి తరిమే శక్తి BJPకే ఉంది’ అని వికారాబాద్‌లో వ్యాఖ్యానించారు.