News September 8, 2024
నా అనర్హతపై ఆనందించడం దేశద్రోహమే: వినేశ్
ఒలింపిక్స్లో తన అనర్హత వేటుపై ఆనందిస్తున్నవారిని దేశద్రోహులుగా పరిగణించి విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత, రెజ్లర్ వినేశ్ ఫొగట్ డిమాండ్ చేశారు. ‘నేను గెలవలేదని హ్యాపీ అవుతున్నారంటే అది దేశద్రోహమే. వారు దేశాన్ని, జాతిని అగౌరవపరిచినట్లే’ అని పేర్కొన్నారు. దేవుడు శిక్షించడం వల్లే వినేశ్ ఒలింపిక్స్లో ఓడారంటూ WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 7, 2024
HYDRA కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!
TG: నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం ₹650కోట్లకే పరిమితమైంది. HYD, పరిసర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువుంది.
News October 7, 2024
BIG ALERT: మళ్లీ తుఫాన్లు.. భారీ వర్షాలు
AP: ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. ఇవాళ మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.
News October 7, 2024
ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’
TG: బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. పూర్వం బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం తగిలి అపవిత్రం జరిగిందని ప్రచారంలో ఉంది. దీంతో ఇవాళ బతుకమ్మను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా సమర్పించరు. అలక వీడాలని అమ్మవారిని మహిళలు ప్రార్థిస్తారు. అటు ఈరోజు దుర్గామాత శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.