India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 1958-1973 మధ్య ఆయన పాక్ తరఫున 41 టెస్టులు ఆడి 2,991 పరుగులు చేశారు. ఈ క్రమంలో 5 సెంచరీలు సాధించిన ఆయన, అందులో 3 భారత్‌పైనే నమోదు చేశారు. ఆఫ్ స్పిన్ వేసే సయీద్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరిగిన 3 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. HYDలోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటకు పైగా వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల పేర్లు, స్థానాల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే కూటమి పార్టీలు తమ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
కర్ణాటక సర్కారుకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో షాక్ తగిలింది. హిందూ దేవాలయాలపై పన్ను విధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తిప్పిపంపారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు ఇదే తరహా పన్ను వర్తింపు ఉందా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మరింత స్పష్టత అవసరమని పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నల్ని అనుసరించి బిల్లును సవరించాలని సూచించారు.
రేపు జరిగే IPL తొలి మ్యాచ్‌లో CSK జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత సీజన్‌లో CSK విజయానికి కృషి చేసిన బౌలర్ పతిరణ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గాయం కారణంగా కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్న పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు IPL ప్రారంభ మ్యాచ్‌కు వెళ్లేందుకు ఇంకా NOC జారీ చేయలేదని సమాచారం. కాగా, రచిన్ రవీంద్ర అరంగేట్రం చేయనున్నారు.
TG: ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్, మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల వేళ కనీసం పోస్టర్లు వేసుకోలేకపోతున్నామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాటే అని అన్నారు. సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు ఇలా చేయడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం నేరపూరిత చర్య అని దుయ్యబట్టారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించట్లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి తలెత్తిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నామని తెలిపారు. విమాన ప్రయాణాల సంగతి తర్వాత.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ తమ వద్ద డబ్బుల్లేవని చెప్పారు. దేశంలో 20శాతం ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని.. కానీ రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నామన్నారు.
తన అరంగేట్ర టెస్టులో సచిన్ వల్లే పుంజుకున్నానని పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ వెల్లడించారు. ‘వాంఖడేలో నా డెబ్యూ మ్యాచ్ అది. 21 ఓవర్లు వేసినా నాకు వికెట్ రాలేదు. దీంతో బాగా డీలా పడ్డాను. సచిన్ నన్ను చూసి దగ్గరికి వచ్చారు. తాను వరల్డ్ కప్ కోసం 21 ఏళ్లు వెయిట్ చేశానని గుర్తు చేసి నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాతి బంతికే వికెట్ తీశాను. ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు దక్కాయి’ అని గుర్తుచేసుకున్నారు.
వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ సందేశాలను పంపడం ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత పదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరిట కేంద్రం WhatsAppలో ఓ <<12863874>>మెసేజ్<<>> పంపుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందేశాలు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపామని, నెట్‌వర్క్ సమస్య వల్ల ఇప్పుడు వస్తున్నాయని ఈసీకి కేంద్రం వివరణ ఇచ్చింది.
AP: వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు టీడీపీ అధిష్ఠానానికి తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ‘టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నా. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది’ అని తెలిపారు. పెనమలూరు టికెట్ రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.