News September 9, 2024
TODAY HEADLINES
➣AP: బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం: CBN
➣AP: అతి భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
➣TG: జర్నలిస్టులకు భూమి పత్రాలు అందించిన CM రేవంత్
➣బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్
➣పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చిన CBN: కురసాల
➣TG:కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం: హైడ్రా కమిషనర్
➣ ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో పేదల ఇళ్లు: KTR
➣31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్
Similar News
News October 9, 2024
BREAKING: నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్
AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ కంపెనీ రాబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీని ద్వారా 10వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. దేశంలో వ్యాపారం చేసేందుకు ఏపీని నంబర్-1గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. కాగా నిన్న బిగ్ <<14307324>>అనౌన్స్‌మెంట్<<>> ఉండబోతున్నట్లు లోకేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
News October 9, 2024
రైతుబంధు నిధులు నొక్కేసిన తహశీల్దార్ అరెస్టు
TG: అక్రమంగా రైతుబంధు నిధులను పొందిన నల్గొండ జిల్లా అనుముల తహశీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రూ.14.63 లక్షల రైతుబంధు సొమ్మును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధరణి ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట 2019లో జయశ్రీ పాస్ బుక్ జారీ చేశారు. జయశ్రీ, జగదీశ్, పట్టాదారులు రైతుబంధు నిధులను సగం సగం పంచుకున్నారు.
News October 9, 2024
హండ్రెడ్ లీగ్‌కు CSK, KKR సై?
ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు చేసేందుకు ఈ రెండు జట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ లంకషైర్ అధీనంలో ఉంది. కాగా హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇప్పటివరకు టైటిల్ కొట్టలేదు. రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది.