India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. కానీ అది సరిపోదని, ఉదారంగా సాయం చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతులకు రూ.6,500, దుస్తులకు రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తం రూ.17,500 ఇవ్వనుంది.
AP: బుడమేరు పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో ఏ క్షణంలోనైనా వరద వచ్చే అవకాశం ఉందని విజయవాడ నీటిపారుదల అధికారులు తెలిపారు. గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయన్నారు. ఒకవేళ వరద వస్తే ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన కోరారు.
గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ఇవాళ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించనుంది. ఈ సారి ఏఐతో కూడిన ఫోన్లను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వీటిలో యాక్షన్ బటన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు రంగుల్లో వీటిని అందించనుంది. ఈ ఫోన్లు పలుచగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
AP: భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాలకు హాలిడే ప్రకటించారు. సెలవు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య SEP 15న వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 2 నగరాల మధ్య 578KM దూరాన్ని ఈ రైలు 7.15 గంటల్లోనే చేరనుంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం నాగ్‌పూర్‌లో ఉ.5 గం.కు బయల్దేరి మ.12.15 గం.కు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మ.1.గం.కు SCలో బయల్దేరి రా.8.20 గం.కు నాగ్‌పూర్ చేరుకోనుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, WGL, ASF, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
AP: ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వరద నష్టంపై అంచనా వేయనున్నారు. ఇందుకోసం 1,400 మంది సిబ్బందిని నియమించారు. విజయవాడలోని 32 డివిజన్లు, 149 సచివాలయాల పరిధిలో నష్టం అంచనా వేస్తారు. ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉంటుంది. బాధితుల సమక్షంలోనే మొత్తం నష్టాన్ని యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. వారాంతాల్లో మాత్రమే కూల్చివేతలు చేపడుతోంది. ఆ రోజుల్లో న్యాయస్థానాలకు సెలవులు కావడంతో బాధితులు కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. దీంతో కూల్చివేతలకు ఎలాంటి ఆటంకం కలగటం లేదు. కాగా చెరువులు, నాలాలు, కాలువల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ పరువు పోగొట్టుకుంటున్నారు. రివ్యూల విషయంలో ఆయన ఖచ్చితంగా వ్యవహరించలేక నవ్వులపాలవుతున్నారు. ఇప్పటివరకు టెస్టుల్లో ఆయన ఒక్క రివ్యూ కూడా నెగ్గలేదు. 10 సార్లు రివ్యూ తీసుకోగా అన్నిసార్లు తనకు ప్రతికూలంగానే తీర్పు వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లో మరే కెప్టెన్ వరుసగా ఇన్ని సార్లు రివ్యూలు కోల్పోలేదు. దీంతో ఆయన టెస్టుల్లో జీరో సక్సెస్ రేటు కలిగి ఉన్నారు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మొండి చేయి చూపింది. సెలక్టర్లు కనీసం ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ నుంచి అయ్యర్ అర్ధంతరంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన భారత జట్టులో చోటుతోపాటు సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయారు.
Sorry, no posts matched your criteria.