News September 9, 2024

తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, WGL, ASF, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Similar News

News October 15, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 15, మంగళవారం
త్రయోదశి: రాత్రి.12.19 గంటలకు
పూర్వాభాద్ర: రాత్రి 10.08 గంటలకు
వర్జ్యం: ఉదయం 6.25-7.51 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 8.21-9.08 గంటల వరకు,
రాత్రి 10.39-11.28 గంటల వరకు

News October 15, 2024

TODAY HEADLINES

image

☞APలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: CM చంద్రబాబు
☞ అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్
☞ వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
☞ TG: ఈనెల 24 నుంచి కులగణనపై అభిప్రాయాల సేకరణ
☞ సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. రాష్ట్రంలో కలకలం
☞ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
☞ టీ20 WC నుంచి భారత మహిళల జట్టు నిష్క్రమణ

News October 15, 2024

BRS అనుమతిచ్చిన దాన్నే KTR వ్యతిరేకిస్తున్నారు: CMO

image

TG: తమ పదేళ్ల పాలనలో దామగుండం ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తాము ఒప్పుకోలేదన్న KTR వ్యాఖ్యలపై CMO స్పందించింది. గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని పేర్కొంది. BRS తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టుపై ఇప్పుడు KTR రాజకీయం చేస్తున్నారని వివరించింది.