India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: దేవాలయ ధ్వజస్తంభానికి నారేప చెట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు అధికంగా పాపికొండల్లో లభ్యమవుతుంది. ఇక్కడి నుంచే వేర్వేరు ప్రాంతాలకు ధ్వజస్తంభాల కోసం తరలిస్తుంటారు. అన్ని చెట్లలో కంటే నారేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కర్ర ఎండకు ఎండినా.. వానకు తడిసినా ఏమాత్రం చెక్కు చెదరదు. ప్రకృతి విపత్తులు తలెత్తినా తట్టుకుని దశాబ్దాలపాటు అలాగే ఉంటుంది. ఈ చెట్టును తరలించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి.
ఈ సీజన్ IPLలో RCB అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఓ దశలో టేబుల్‌లో లాస్ట్ ప్లేస్. మైనస్ రన్‌రేట్. ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు 1% అవకాశం. బెంగళూరు కథ ముగిసినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా పుంజుకుని విజయాలవైపు అడుగులు వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో, అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా వరుసగా 6 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. 14 పాయింట్లతో CSKతో సమంగా నిలిచి.. మంచి రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.
సింగపూర్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్ ప్రారంభ దశలో ఉందని.. రానున్న 2-4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. రోజుకు 250 మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా.. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోస్ టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
AP: ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు రూ.7546.34 కోట్ల చెల్లింపులు జరిపామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ తెలిపారు. ఎన్నికల నియమావళి, ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. డీబీటీ పథకాల నిమిత్తమే రూ.5866.26 కోట్లు విడుదల చేశామన్నారు. కేంద్ర పథకాలు, అప్పులు, జీతాలు, పెన్షన్లు, పాలనాపరమైన ఖర్చులు, తదితర వాటికి మిగతా మొత్తం చెల్లించినట్లు పేర్కొన్నారు.
ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు చివరి భోజనం తినడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ వైద్యులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు తినేవారి కంటే, 9 గంటలకు తినే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం 6శాతం ఎక్కువగా ఉంటాయన్నారు. రాత్రి 8కి బదులు 9 గంటలకు తినడం వల్ల మహిళల్లో స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28శాతం పెరుగుతుందన్నారు.
పుచ్చలపల్లి సుందరయ్య.. నిజాయతీకి మారుపేరుగా ఉదహరించే మహానాయకులలో ఒకరు. ఈయన 1913లో నెల్లూరు(D) అలగానిపాడులో జన్మించారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో చేరి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాసేవకు నిబద్ధుడై పిల్లల్ని సైతం కనలేదు. చట్టసభలకు సైకిల్‌పై వెళ్లిన నిరాడంబరుడు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసి చరిత్ర పుటల్లో నిలిచిన ఈ ఎర్రసూరీడు 1985 మే19న అస్తమించారు.
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో కార్మికుల ఉద్యోగాలకు HYD న్యాక్‌లో రేపటి నుంచి ఈనెల 24 వరకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 21-45 ఏళ్ల వయసు, సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. నెలవారీ వేతనం ప్యాకేజీలు రూ.1.20లక్షల నుంచి రూ.1.38 లక్షల వరకు ఉంటాయి. పూర్తి వివరాలకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ <
AP: అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. వర్షాలు పడుతుండటంతో ప్రజలు పొలాలను జల్లెడ పడుతున్నారు. అక్కడి పొలాలన్నీ వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి వజ్రాలు వెతికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా జూన్, జులైలో కురిసే వర్షాలకు ఇక్కడ రాళ్లను వెతకడానికి ప్రజలు వస్తుంటారు. చిన్న రాయి (వజ్రం) కూడా భారీ ధర పలుకుతుంది.
AP: వైఎస్సార్ చేయూత పథకం నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద రూ.5065 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1552.32 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా రూ.3512.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
AP: టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. ఆయన వెంట భార్య భువనేశ్వరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదారు రోజులపాటు చంద్రబాబు అక్కడే ఉండనున్నారు. గతంలో కూడా ఆయన వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కూడా అమెరికా వెళ్లారు.
Sorry, no posts matched your criteria.