News September 9, 2024
US ఓపెన్ టెన్నిస్ పురుషుల విజేతగా సిన్నర్

యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ స్టార్ ప్లేయర్ జన్నిక్ సిన్నర్ నిలిచారు. అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4, 7-5 ఆధిక్యంతో గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడారు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఇద్దరి మధ్య రెండు గంటలకుపైగా జరిగింది. కాగా యూఎస్ ఓపెన్ మహిళల విజేతగా అరీనా సబలెంక నిలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News December 8, 2025
గద్వాల్: 700 పోలింగ్ కేంద్రాలు- కలెక్టర్ సంతోష్

ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, మనోపాడు, ఉండవెల్లి మండలాల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించడానికి పీఓలు 700, ఓపీఓలు 859 సిబ్బంది మొత్తం 1,559 మందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామన్నారు.
News December 8, 2025
టెన్త్ అర్హతతో 25,487పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్

*ఇవాళ 1.30PMకు గవర్నర్ ఈ సదస్సును ప్రారంభిస్తారు
*ప్రజాపాలన, రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి గెస్టులకు వివరిస్తారు
*3PM-7PM వరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కొరియా బృందం, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వరల్డ్ బ్యాంక్, SIDBI సహా వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.


