India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కలలు అందరికీ ఉంటాయి. అవి నిజం చేసుకునేందుకు కొందరే కృషి చేస్తారు. కళారంగంలో అలాంటి నిత్య కృషీవలుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని చిరు ట్వీట్ చేశారు. ఇక ‘హ్యాపీ బర్త్‌డే మై డియర్ బ్రదర్’ అంటూ కాంతార హీరో రిషభ్ శెట్టి కూడా ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేసిన గిరిజనుడి ఫొటోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదేనంటూ కొనియాడారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన అడవుల్లో నివసించే షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎదురులేదని, తిరుగులేని శక్తి అని మహీంద్రా కొనియాడారు.
TG: రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఇందులో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ ప్లాన్, తెలంగాణ అవతరణ వేడుకలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.
TG: కిర్గిస్థాన్‌లో భారత విద్యార్థులపై దాడి ఘటనపై CM రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆదేశాలతో అధికారులు బిష్కక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీతో మాట్లాడారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. స్థానిక ఘటనల్లో మన విద్యార్థులెవరూ గాయపడలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు.
కోల్‌కతా తిరుగులేని విజయాలు సాధించడంలో ఓపెనర్లు నరైన్(461 రన్స్), ఫిల్ సాల్ట్(435)ది కీలక పాత్ర. వారి మెరుపులతోనే KKR భారీ స్కోర్లు చేసి విజయాల బాటపట్టింది. అయితే.. T20WC కోసం సాల్ట్ ఇంగ్లండ్ వెళ్లారు. దీంతో KKR ఓపెనింగ్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. ఆ స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను దించే అవకాశం ఉంది. అయ్యర్ 267రన్స్ చేసి ఫరవాలేదనిపిస్తున్నా కీలక ప్లేఆఫ్స్‌లో ఒత్తిడి తట్టుకోగలరా అనేది సందేహంగా మారింది.
ఏపీ అల్లర్లపై సిట్ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. సిట్ ప్రాథమిక నివేదికను సీఎస్ జవహర్ రెడ్డి ఈసీకి పంపించారు. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన ఘర్షణలపై రూపొందించిన నివేదికను సిట్ కొద్దిసేపటి క్రితమే డీజీపీ హరీశ్ గుప్తాకు అందజేసింది. అనంతరం దాన్ని ప్రభుత్వం ఈసీకి పంపించింది.
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విదేశీ నిధుల సేకరణలో అక్రమాలకు పాల్పడిందని ఈడీ ఆరోపించింది. 2014-2022 మధ్య US, కెనడా, ఆస్ట్రేలియాతో సహా పలు దేశాల నుంచి ₹7.08కోట్లు పొందిందని పేర్కొంది. దాతల వివరాలను అకౌంట్స్ బుక్‌లో చూపించకుండా దాచిపెట్టిందని తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను AAP ఉల్లంఘించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలిపింది.
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, ఇండస్ట్రీ మిత్రులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన అభిమానులారా.. నా ప్రయాణంలో మొదటి రోజు నుంచి మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు. మీ అసమానమైన ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను. దేవర ఫస్ట్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో 5 గంటల వరకు 56.68% పోలింగ్ నమోదైంది. గరిష్ఠంగా బెంగాల్‌లో 73% పోలింగ్ రికార్డ్ అయింది. ఆ తర్వాత స్థానంలో 67.15శాతంతో లద్దాక్ నిలిచింది. కనిష్ఠంగా మహారాష్ట్రలో 48.66% పోలింగ్ నమోదైంది. కాగా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని పలు బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా సాగుతోంది. బెంగాల్‌లో పలు చోట్ల బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.