news

News May 21, 2024

KALKI: ‘బుజ్జీతో భైరవా’.. RFCలో ఈవెంట్

image

ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తోన్న బుజ్జీని పరిచయం చేసేందుకు ‘కల్కి’ మేకర్స్ వేదికను ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ‘కల్కి’ సినిమా కోసం తయారుచేసిన స్పెషల్ కారును రివీల్ చేస్తారు. ‘భైరవా, బుజ్జీని కలుసుకోండి’ అంటూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ జూన్ 27న విడుదల కానుంది.

News May 21, 2024

మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఉత్తమ్

image

TG: సీఎం పదవి కోసం తాను ఢిల్లీకి రూ.100కోట్లు పంపించానని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లానని, త్వరలోనే మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలకు తగిన జవాబు చెబుతానని స్పష్టం చేశారు.

News May 21, 2024

ఆ రేవ్‌ పార్టీతో నాకు సంబంధం లేదు: కాకాణి

image

AP: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అక్కడ దొరికిన కారుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. కాగా.. కాకాణి కనుసన్నల్లోనే ఈ రేవ్ పార్టీ జరిగిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు.

News May 21, 2024

యూరప్ ట్రిప్ ఇక మరింత ప్రియం!

image

యూరప్‌లో పర్యటించాలనుకునేవారికి ఈయూ షాకిచ్చింది. షెంజెన్ వీసా దరఖాస్తు రుసుమును పెద్దలకు 80 యూరోల నుంచి 90 యూరోలకు పెంచింది. 6 నుంచి 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు 40 యూరోల నుంచి 45 యూరోలకు పెంచింది. వచ్చే నెల 11 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఐరోపా సమాఖ్యలోని 29 దేశాల్లో 90 రోజుల పాటు తిరిగేందుకు జారీ చేసే వీసాను షెంజెన్ వీసాగా వ్యవహరిస్తారు.

News May 21, 2024

రతన్ టాటాతో మాస్టర్ బ్లాస్టర్

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను కలుసుకున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘గత ఆదివారం టాటాతో కాస్త సమయం గడిపే అవకాశం లభించింది. మేమిద్దరం ఆటో మొబైల్స్, వన్యప్రాణుల సంరక్షణ, సమాజ సేవ గురించి చర్చించుకున్నాం. దీంతోపాటు పెంపుడు కుక్కలపై మా ఇద్దరికి ఉన్న ప్రేమను తెలియజేసుకున్నాం. ఇలాంటి సంభాషణలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అని సచిన్ తెలిపారు.

News May 21, 2024

క్యాట్ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

image

AP: సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ <<13275133>>ఆదేశాల<<>>పై ఏపీ ప్రభుత్వం హైకోర్టు‌ను ఆశ్రయించింది. క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 23న విచారణ జరిగే అవకాశముంది. మరోవైపు ఈ నెలాఖరుతో వెంకటేశ్వర రావు పదవీకాలం ముగియనుంది.

News May 21, 2024

దేవుడిపై అభ్యంతర వ్యాఖ్యలు.. BJP నేత క్షమాపణ

image

జగన్నాథుడిపై చేసిన వ్యాఖ్యల విషయంలో తాను బాధపడుతున్నానని బీజేపీ నేత సంబిత్ పాత్ర తెలిపారు. ఈ విషయంలో నోరు జారానని ఒప్పుకొన్న ఆయన క్షమాపణలు చెప్పారు. అందుకు ప్రాయశ్చిత్తంగా 3 రోజులు ఉపవాసం ఉంటానని ప్రకటించారు. పూరీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ ఇటీవల ‘జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోదీకి భక్తుడు’ మాట తూలారు.

News May 21, 2024

సందేశ్‌ఖళీని సందర్శిస్తా: సీఎం మమత

image

బెంగాల్‌ రాజకీయాలను అతలాకుతలం చేసిన సందేశ్‌ఖళీ ప్రాంతాన్ని ఎన్నికల తర్వాత సందర్శిస్తానని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అక్కడ తమ పార్టీ ఎంపీ అభ్యర్థి హాజీ నురుల్ గెలిచిన తర్వాత వెళ్లి, అక్కడ ప్రజలను కలుస్తానన్నారు. కాగా.. అక్కడ TMC లీడర్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ప్రచారం జరగడంతో దుమారం రేగింది. అయినా సందేశ్‌ఖళీకి మమత వెళ్లలేదు.

News May 21, 2024

ఆరవ్‌కి సినిమాలు చేయడం ఇష్టం లేదు: అక్షయ్

image

తన కుమారుడు ఆరవ్ సినిమాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా లేడని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆరవ్ లండన్‌లో చదువుతున్నాడని చెప్పారు. అతనికి సినిమాల కన్నా ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఎక్కువని తెలిపారు. ఆరవ్‌కు నచ్చింది చేయమని సూచించినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా అక్షయ్, ట్వింకిల్ ఖన్నా పెళ్లి చేసుకొని 23 ఏళ్లు పూర్తయ్యాయి. వీరికి నితార అనే కూతురు కూడా ఉంది.

News May 21, 2024

అమెరికాలో ‘బోర్గ్ డ్రింకింగ్’ ట్రెండ్.. యువతపై ఎఫెక్ట్!

image

అమెరికా కాలేజీల్లో ప్రమాదకర ‘బోర్గ్ డ్రింకింగ్’ ట్రెండ్ విస్తరిస్తోంది. బోర్గ్ అంటే గ్యాలన్‌‌(3.78లీటర్లు) సైజు పాత్రలో అధిక మోతాదులో ఆల్కహాల్‌తో పాటు రుచి తెలియకుండా హానికర రసాయనాలతో చేసిన పానీయం. దీనిని తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు, కాలేజీ యాజమాన్యాలు అవగాహన సదస్సులు చేపట్టినా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.