news

News May 23, 2024

ఎల్లుండి అమెరికాకు భారత ఆటగాళ్లు?

image

టీ20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 25న టీమ్ఇండియా ప్లేయర్లు, సిబ్బంది అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్లలోని ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు సమాచారం. మొదట రోహిత్, కోహ్లీ, హార్దిక్, బుమ్రా, సూర్య, పంత్, అక్షర్, అర్ష్‌దీప్, కుల్దీప్, సిరాజ్‌ వెళ్లనుండగా.. ఐపీఎల్ ఫైనల్ తర్వాత మిగతా ప్లేయర్స్ అక్కడికి చేరుకోనున్నారట. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

News May 23, 2024

16 ఏళ్లలోపు వారికి ఇక నో సోషల్ మీడియా.. ఎక్కడంటే?

image

పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై చట్టం చేసేందుకు ఆ దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా మద్దతు తెలిపారు. పిల్లలు ఆన్‌లైన్‌లో కాకుండా మైదానాల్లో ఆడుకునేలా చేయడం, సోషల్ మీడియా వల్ల వారు దారితప్పకుండా, మానసికంగా దెబ్బతినకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

News May 23, 2024

వెంకీ-మనోజ్ కాంబోలో మూవీ?

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో వెంకటేశ్, మంచు మనోజ్ కలిసి నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌ కథాంశంతో ఉండే ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా అనిల్ రూపొందించిన F2, F3 చిత్రాల్లో వెంకీ- వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

News May 23, 2024

RCB ఓటమితో డివిలియర్స్ హార్ట్ బ్రేక్!

image

ప్లే ఆఫ్స్‌లో రాజస్థాన్‌పై బెంగళూరు ఓటమి పాలవడంతో ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కామెంటరీ చేస్తూనే ఆయన బాధపడుతూ కనిపించారు. ఓటమిని తట్టుకోలేక ఏబీడీ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా డివిలియర్స్ దశాబ్ద కాలంపాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించారు. 4,500కు పైగా పరుగులు సాధించారు.

News May 23, 2024

రీపోలింగ్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

image

AP: సత్తెనపల్లి, చంద్రగిరిలోని పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. సత్తెనపల్లిలోని 236, 237, 253, 254 బూత్‌లు, చంద్రగిరిలోని 4 కేంద్రాల్లో TDP నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఏజెంట్లపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ, సీఈవోతోపాటు పలువురు అధికారులు, టీడీపీ నేతలను ప్రతివాదులుగా చేర్చారు.

News May 23, 2024

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. భూపాలపల్లి, భద్రాద్రి, MLG, NLG, KHMM, SRPT, RR, HYD, MDCL, NGKL, MDK, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాబోయే 3 రోజుల్లో ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ABD, ASFD, NML, MNCL, PDPL, JGL జిల్లాల్లో 45°C దాటొచ్చని తెలిపింది.

News May 23, 2024

ఒక్కో బిడ్డపై ఖర్చు రూ.75 లక్షలు

image

మన దేశంలో పిల్లలను కని, పెంచి, డిగ్రీ వరకు చదివించేందుకు పేరెంట్స్ ఒక్కో బిడ్డపై సగటున ₹75 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ‘ఎడ్యూ ఫండ్’ నివేదిక వెల్లడించింది. ఇంజినీరింగ్ బదులు మెడిసిన్ చదివితే ₹95 లక్షలు, విదేశాలకు వెళితే ₹1.5 కోట్లకు పైగా వ్యయం అవుతోందని తెలిపింది. ఈ భారీ ఖర్చులకు భయపడి కొత్త జంటలు పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. దీంతో జనాభా పెరుగుదలలో క్షీణత ఏర్పడుతోందని చెప్పింది.

News May 23, 2024

‘కోల్ కారిడార్’ ప్రాజెక్టు.. 25 ఏళ్లకి పడిన ముందడుగు!

image

TG: రామగుండం-మణుగూరు ‘కోల్ కారిడార్’ రైల్వే <<13298191>>లైన్‌ను<<>> పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలను కలుపుతూ 207.80కి.మీ మేర నిర్మించనున్నారు. పెద్దపల్లి(M) రాఘవపూర్ నుంచి మణుగూరుకు లైన్ నిర్మాణానికి 1999లోనే తొలి అడుగు పడింది. 2013-14లో ప్రాథమిక పనుల కోసం కేంద్రం రూ.10కోట్లు కేటాయించినా ముందడుగు పడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

News May 23, 2024

రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ రద్దు

image

TG: రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు తెలిపారు. తాము కోరుకున్న విధంగా నిర్మాతలు పర్సెంటేజీలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సెంటేజీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు జూన్ 1 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. కల్కి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, భారతీయుడు సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని చెప్పారు.

News May 23, 2024

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు: సీఈఓ

image

AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీ షా హెచ్చరించారు. రోగులకు సేవలు ఆగకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. కాగా ఆరోగ్యశ్రీ సీఈఓతో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు రెండు సార్లు చర్చలు జరపగా విఫలమయ్యాయి. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి నిరాకరించడంతో యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి.