News September 8, 2024
నల్గొండకు జాతీయ అవార్డు.. గాలి నాణ్యత మెరుగుదలకు గుర్తింపు
దేశంలో 3 లక్షలు అంతకంటే తక్కువ జనాభా గల నగరాల్లో గాలి నాణ్యత మెరుగుదలలో రాయ్‌బరేలీ మొదటి స్థానంలో నిలవగా నల్గొండ 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 10 లక్షలపైన జనాభా నగరాల్లో సూరత్ మొదటి స్థానంలో, ఫిరోజాబాద్, అమరావతి(మహారాష్ట్ర) తరువాతి స్థానాల్లో నిలిచాయి. వాయుకాలుష్యంలో PM10 స్థాయి తగ్గుదలకు గుర్తింపుగా కేంద్రం స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేసింది.
Similar News
News October 7, 2024
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.
News October 7, 2024
జగన్ పుంగనూరు పర్యటన రద్దు: పెద్దిరెడ్డి
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని ఎల్లుండి పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నట్లు చెప్పారు. జగన్ పర్యటిస్తారనే భయంతోనే ముగ్గురు మంత్రులు ఆఘమేఘాల మీద ఇక్కడికొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 7, 2024
అదృష్టంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు: కాంగ్రెస్ ఎంపీ
రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు ఎంపీ(INC) తిరునావుక్కరసర్ మండిపడ్డారు. ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. తమిళనాడు నేతలను విమర్శించే స్థాయి ఆయనకు లేదని, అంతపెద్ద నాయకుడేమీ కాదని చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అని, వీధుల్లో వెలిసే విగ్రహం వంటివారని పేర్కొన్నారు.