India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమను 400 MP సీట్లతో గెలిపిస్తే జ్ఞానవాపితో పాటు కృష్ణుడి జన్మస్థానమైన మథురలోనూ దేవాలయాలు నిర్మిస్తామని BJP నేత, అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. తమ పని ఇంకా పూర్తి కాలేదని, మథురలో షాహీ ఈద్గా, జ్ఞానవాపి మందిర్ స్థానంలో జ్ఞానవాపి మసీదు ఉన్నాయన్నారు. తమను గెలిపిస్తే అవి పరిష్కారమయ్యేలా చేస్తామన్నారు. అయోధ్యలో టెంట్‌లో ఉన్న బాల రాముడికి తామే విముక్తి కల్పించామన్నారు.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2014(8,251 మంది), 2019(8,054 మంది) ఎన్నికల కంటే ఈ సంఖ్య ఎక్కువ. ఇందులో మహిళల వాటా 10శాతం లోపే ఉంది. చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంత తక్కువ మొత్తంలో మహిళలు పోటీకి దిగడం గమనార్హం. ఇక జూన్ 4న వీరందరి భవితవ్యం వెల్లడి కానుంది. <<-se>>#Elections2024<<>>
AP: విజయవాడలోని సీపెట్ కేంద్రంలో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ జేడీ శేఖర్ తెలిపారు. పదో తరగతి పాసైన వారికి మూడేళ్ల డిప్లమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, బీఎస్సీ చేసిన వారికి రెండేళ్ల పీజీ కోర్సు అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే నెల 9న విజయవాడ, అనంతపురంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అప్లై లింక్: https://cipet24.onlineregistrationform.org/CIPET/
ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే RCB కల మరోసారి కల్లలయ్యింది. నిన్న RR చేతిలో ఓటమితో టోర్నీ ప్లేఆఫ్స్‌లో అత్యధికసార్లు(16 మ్యాచ్‌లలో 10 సార్లు) వెనుదిరిగిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో CSK(26M.. 9 ఓటములు), DC(11M.. 9 పరాజయాలు), MI(20M.. 7 ఓటములు), SRH(12M.. 7 పరాజయాలు) ఉన్నాయి. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలవని విషయం తెలిసిందే.
TG: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో రైతుల కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళా జరగనుంది. 16 పంటల్లో 67 రకాలకు చెందిన 12వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. HYD రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంతోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యయసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో మేళాను అధికారులు నిర్వహిస్తారు.
AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.
ప్రపంచ కప్ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల ఆర్చరీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏపీకి చెందిన జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామి బృందం సెమీ ఫైనల్లో 233-229 పాయింట్లతో అమెరికాను ఓడించింది. శనివారం ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీ పడుతుంది. కాగా షాంఘైలో గత నెలలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో జ్యోతి సురేఖ బృందం గోల్డ్ మెడల్ సాధించింది.
TG: రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్న వడ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై మంత్రి స్పందించారు. పేదలు సన్నబియ్యం తినాలని సంకల్పించామన్నారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాకు రూ.500బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకూ దీన్ని వర్తింపజేస్తామని వివరించారు.
TG: ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు వెళ్లనున్నాయి. అతిథులకు ప్రసిద్ధి చెందిన హస్తకళారూపాలను ఇవ్వాలని అంబానీ కుటుంబం నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి జ్యూయలరీ బాక్సులు, ట్రేలు, పర్సులు వంటి వస్తువులకు ఆర్డర్ ఇచ్చారు. వెండి తీగతో ఇక్కడి కళాకారులు వస్తువుల్ని రూపొందిస్తారు. గతేడాది జీ20 సదస్సుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి నుంచే పంపారు.
TG: రేపటి నుంచి జూన్ 3 వరకు జరగనున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 900 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.