news

News September 12, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 12, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:12 గంటలకు
అసర్: సాయంత్రం 4:36 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:21 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 12, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 12, గురువారం
నవమి: రా.11.33 గంటలకు
మూల: రా.9.52 గంటలకు
వర్జ్యం: రా.8.14-9.52 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.10.01-10.50 గంటల వరకు,
మ.2.54-3.43 గంటల వరకు,

News September 12, 2024

టుడే టాప్ స్టోరీస్

image

➣AP: దెబ్బతిన్న ఎకరా వరికి రూ.10వేల పరిహారం: CBN
➣TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై పూర్తి బాధ్యత నాదే: రేవంత్
➣AP: చంద్రబాబు వల్ల 60 మందికి పైగా చనిపోయారు: జగన్
➣AP: తక్కువ ధరలకే మద్యం అందించేలా పాలసీ: మంత్రి కొల్లు
➣TG: త్వరలో 4వేల ఉద్యోగాల భర్తీ చేస్తాం: మంత్రి దామోదర
➣TG: HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయింది: హరీశ్
➣ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి 70 ఏళ్ల పైబడినవారు

News September 12, 2024

ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలంటే?

image

* అప్పుడే పుట్టిన పిల్లలు: 18 గంటలు
* 4-11 నెలల చిన్నారులు: సుమారు 15 గంటలు
* 3-5 ఏళ్ల పిల్లలు: 13 గంటలు
* 6-12 ఏళ్ల పిల్లలు: 9-12 గంటలు
* 13-18 ఏళ్ల వారు: కనీసం 8 గంటలే
* 18-60 ఏళ్ల వారు: 7-9 గంటలు
* 60 ఏళ్లు పైబడినవారు: 7-8 గంటలు
** లేదంటే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.

News September 12, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

image

పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.

News September 11, 2024

మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

image

తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ బులిటెన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ అందించారు.

News September 11, 2024

తండ్రి ఆత్మహత్య.. నటి ఎమోషనల్ పోస్ట్

image

తండ్రి అనిల్ మెహతా <<14074510>>మరణంపై<<>> బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఆయన ఎంతో సౌమ్యుడు. ప్రేమగల భర్త, మంచి గ్రాండ్ ఫాదర్, మా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఘటనతో మా కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, శ్రేయోభిలాషులను కోరుతున్నా. కష్టసమయంలో అండగా నిలిచిన వారందరీకి కృతజ్ఞతలు’ అని ఆమె రాసుకొచ్చారు.

News September 11, 2024

రేపు అమిత్ ‌షాతో సీఎం రేవంత్ భేటీ?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని వివరించేందుకు షా అపాయింట్‌మెంట్‌ను సీఎంవో కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి వరద సాయం చేయాలని సీఎం కేంద్రమంత్రిని కోరే ఛాన్సుంది. అటు ప్రధానితో భేటీకి కూడా రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News September 11, 2024

అటవీ అమరవీరులకు నివాళులు: పవన్

image

AP: అటవీ సంపదను పరిరక్షించడంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయమని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘APలో 37,421 చ.కి.మీ అమూల్యమైన అటవీ సంపదను రక్షించడంలో మన సిబ్బంది ముందంజలో ఉన్నారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. వారికి నివాళులర్పిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.