News September 12, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.
Similar News
News January 14, 2026
హసన్‌పర్తిలో ఘోర ప్రమాదం… రోడ్డెక్కిన కుటుంబం

HNK జిల్లా హసన్‌పర్తి వద్ద హైవే టిప్పర్ ఢీకొనడంతో కేశవాపూర్‌కు చెందిన పాల వ్యాపారి ఈర కుశుడు (38) మృతి చెందాడు. న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు 8 నెలల బిడ్డతో కలిసి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. రెండు గంటలుగా నిరసన కొనసాగుతుండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. చిన్నపాపకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించారు.
News January 14, 2026
తెలుగు ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.
News January 14, 2026
పితృ దేవతలకు నేడు తర్పణాలు వదిలితే..

మకర సంక్రాంతి ఎంతో పవిత్ర దినం. తండ్రీకొడుకులైన సూర్యశనుల కలయికకు ఇది ప్రతీక. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పేదలకు అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. కొత్త కుండలో పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం సమర్పిస్తారు. శని దోష నివారణకు నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేస్తారు. పంట చేతికి వచ్చే ఈ ‘కుప్ప నూర్పిడుల పండుగ’ వెలుగును, ఆరోగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే గొప్ప వేడుక.


