India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TS: కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. దానంపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసేందుకు సభాపతి ఇంటికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చి ఇప్పుడు స్పీకర్ స్పందించడం లేదని.. రేపు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప-2పై మరో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కొన్ని సీన్లలో బన్నీ ఓల్డ్ గెటప్‌లో కనిపిస్తాడని, తన వాయిస్ మాడ్యులేషన్‌ను కూడా ఓల్డ్ ఏజ్ స్టైల్‌లో చెప్పబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్‌పై యూనిట్ స్పందించాల్సి ఉంది. అటు రెట్టించిన ఉత్సాహంతో ఆడియన్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ విలువ గత రెండేళ్లలో రూ. 41వేల మేర తగ్గింది. దాని మాతృసంస్థ వాల్‌మార్ట్ ఈక్విటీ వివరాల్లో ఈ విషయం వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం సంస్థ విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది జనవరికి అది 35 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ అంచనాలను ఫ్లిప్‌కార్ట్ తప్పుబట్టింది. తమ సంస్థ నుంచి ఫోన్ పే 2023లో వేరుపడినప్పటికీ.. ఆ సమాచారాన్ని వాల్‌మార్ట్ అప్‌డేట్ చేయలేదని వివరించింది.
AP: గత నెల 25న 897 గ్రూప్-2 ఉద్యోగాలకు జరిగిన ప్రిలిమినరీ పరీక్షపై APPSC కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు. వచ్చే వారం అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రిలిమ్స్ కఠినంగా వచ్చినందున 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ నౌకాదళంలో తొలిసారిగా ఓ నిఘా నౌక చేరింది. భారత్‌పై కన్నేసి ఉంచేందుకు చైనా ఈ నౌకను అందించింది. అణు వార్‌హెడ్‌లు ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్ని గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ నౌకను పాక్ ‘పీఎన్ఎస్ రిజ్వాన్’గా పిలుస్తోంది. చైనాలోని ఫుజియాన్ మావై షిప్ బిల్డింగ్ సంస్థ నిర్మించింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, భారత్ వద్ద మాత్రమే ఈ తరహా నిఘా నౌకలు ఉండగా పాక్ వాటి సరసన చేరింది.
FIITJEE కోచింగ్ సంస్థ తాజా ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ సంస్థను వదిలి వేరే సంస్థలో కోచింగ్ తీసుకున్న ఓ యువతి ప్రదర్శన దిగజారిందని పేర్కొంటూ ఆమె ఫొటోను ప్రకటనలో ప్రచురించింది. ఇక వేరే సంస్థలతో తమ సంస్థను పోల్చుకుంటూ.. ఒక సంస్థ పేరు కింద దానిలో అంతా ఆత్మహత్యలే అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో FIITJEEపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ పవర్ ప్లేలో 61 పరుగులు చేశారు. షెఫాలీ 21 బంతుల్లోనే 42*, లానింగ్ 14 బంతుల్లో 17* రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్ రేణుకా ఠాకూర్ సింగ్ 4వ ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నారు.
దేశంలోనే అండమాన్ & నికోబార్ ద్వీపంలో పెట్రోల్ ధరలు అత్యల్పం. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.82గా ఉంది. ఆ తర్వాత డామన్‌లో రూ.82, ఐజ్వాల్‌లో రూ.93.68, ఢిల్లీలో రూ.94గా ఉండగా.. అత్యధికంగా ఏపీలో రూ.109.87గా ఉంది. ఆ తర్వాత కేరళ(రూ.107.54), తెలంగాణ(రూ.107.39) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధికంగా ఏపీలో లీటర్ డీజిల్ ధర రూ.97.6గా ఉండగా.. ఆ తర్వాత కేరళ రూ.96.41, తెలంగాణ రూ.95.63 ఉన్నాయి.
AP: చిలకలూరిపేటలో ఇవాళ జరిగిన TDP-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘ఈ సభలో ప్రధాని మోదీకి అవమానం జరిగింది. మైక్ మూగబోవడంతో ఆయన బొమ్మలా నిలబడ్డారు. సభ జరుపుకోవడం చేతకానివారు జగన్‌పై యుద్ధం అంటున్నారు. లోపాయికారి ఒప్పందం చేసుకున్న మీకు ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు.
ఒకవైపు కవిత అరెస్ట్.. మరోవైపు పార్టీ ఫిరాయింపులు BRSలో కలకలం రేపుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వరుసగా రాం.. రాం.. చెప్తుండటంతో ఎవరు ఎప్పుడు పక్కచూపులు చూస్తారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగేందుకు సిద్ధమవుతుండటం గులాబీ పార్టీని కంగారు పెడుతోంది. పార్లమెంట్ పోరుకు ముందు ఈ చేరికలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాంగ్రెస్, బీజేపీ టార్గెట్‌గా తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.