news

News May 22, 2024

ర్యాష్ డ్రైవింగ్ కేసులో మైనర్‌కు బెయిల్ రద్దు

image

ర్యాష్ డ్రైవింగ్‌తో పుణేలో ఇద్దరి మరణానికి కారణమైన 17 ఏళ్ల బాలుడికి జస్టిస్ జువైనల్ బోర్డు బెయిల్ రద్దు చేసింది. మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన మైనర్‌ని పిల్లల పరిశీలన కేంద్రానికి పంపనున్నట్లు పేర్కొంది. జూన్ 5 వరకు నిందితుడిని రిమాండ్ హోమ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. నేరం తీవ్రత కారణంగా అతడిని పెద్దవాడిగానే పరిగణనలోకి తీసుకోవాలని పుణే పోలీసులు కోర్టును కోరుతున్నారు.

News May 22, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: CM

image

TG: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పరిధిలోని అన్ని బూత్‌లను ఎమ్మెల్యేలు సందర్శించాలని, కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.

News May 22, 2024

హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి

image

AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గంలోని 236, 237, 253, 254 బూత్‌లలో పోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈసీ, సీఈవోతో పాటు మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై రేపు కోర్టు విచారణ చేపట్టనుంది.

News May 22, 2024

ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా?

image

మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావొచ్చు. పక్కనే పెట్టుకున్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయట. వీలైనంతగా ఫోన్‌ను దూరంగా ఉంచాలి. అలారం కోసం ప్రత్యేక వాచ్ కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు.

News May 22, 2024

IPL: మ్యాక్స్‌‌వెల్ చెత్త రికార్డు

image

ఈ సీజన్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు నాలుగు సార్లు సున్నాకే వెనుదిరిగారు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్సుల్లో 5.77 సగటుతో 59 పరుగులు చేశారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్‌గా కార్తీక్(18) రికార్డును మ్యాక్సీ సమం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(17), పియూష్ చావ్లా(17), నరైన్(16) ఉన్నారు.

News May 22, 2024

మ్యాక్సీ.. ఏం ఆటయ్యా బాబూ!!

image

IPL: అంతర్జాతీయ మ్యాచుల్లో అదరగొట్టే మ్యాక్స్‌వెల్.. IPLలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నారని ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈ విమర్శలకు అతడి గణాంకాలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. గత 9 అంతర్జాతీయ టీ20ల్లో 60.50 సగటు, 192 SRతో 363 రన్స్ చేసిన ఈ ఆసీస్ ప్లేయర్.. ఆర్సీబీ తరఫున 9 మ్యాచుల్లో 5.77 సగటుతో 52 రన్స్ మాత్రమే చేశారు. మరి రాబోయే టీ20 WCలో మ్యాక్సీ ఎలా ఆడతారో చూడాలి.

News May 22, 2024

ఆర్మీ జనరల్‌తో జైశంకర్ భేటీ.. మతలబేంటో?

image

భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని మంత్రి తెలిపారు. కాగా.. POK మనదేనని, దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ఇటీవల కేంద్రం పదేపదే చెబుతున్న వేళ ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

News May 22, 2024

20 ఓవర్లలో RCB స్కోర్ ఎంతంటే?

image

RRతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేశారు. విరాట్ (33), రజత్ పటీదార్ (34), లామ్రోర్ (32) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ 3, అశ్విన్ 2, బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.

News May 22, 2024

నలుగురిని ఢీ కొట్టిన మైనర్

image

పుణేలో ఓ 17ఏళ్ల బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరిని బలిగొన్న ఘటన మరువక ముందే మరో బాలుడు(15) నలుగురిని గాయపరిచాడు. UPలోని కాన్పూర్‌లో ఓ పేరొందిన డాక్టర్ కుమారుడి డ్రైవింగ్ వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఇదే బాలుడు గతేడాది తన డ్రైవింగ్‌తో ఇద్దరి మృతికి కారణమయ్యాడు. తాజా ఘటనతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోమ్‌కి తరలించారు. రెండు ఘటనల్లోనూ బాలుడి తండ్రిపై కేసు నమోదు చేశారు.

News May 22, 2024

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?

image

తమిళనాడు క్రీడా మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు తమిళనాడు కేబినెట్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గతేడాది కూడా డిప్యూటీ సీఎంగా ఉదయనిధిని చేస్తారని చర్చ జరిగిన సంగతి తెలిసిందే.