News September 13, 2024
సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ రోజు
1913: సినీ నటుడు సీహెచ్ నారాయణరావు జననం
1948: హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశం
1960: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జననం
1960: సినీ నటుడు కార్తీక్ జననం
1965: నటి ముచ్చర్ల అరుణ జననం
1969: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ జననం
1989: సినీ రచయిత ఆచార్య ఆత్రేయ మరణం
Similar News
News October 11, 2024
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
AP: ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.
News October 11, 2024
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ డైరెక్టర్
సగటు తెలుగు సినిమా అభిమానులకు దర్శకుడు వి.వి.వినాయక్ పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్లతో ఆయన సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్‌తో ఉన్న ఫొటోలో ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.
News October 11, 2024
IPL వేలంలో రోహిత్? హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై జట్టును వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోహిత్ గనుక వేలంలో పాల్గొంటే మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పారు. అతడిని దక్కించుకునేందుకు ఏ జట్టు అత్యధికంగా బిడ్ వేస్తుందో చూడాలని ఉందన్నారు. రోహిత్‌లో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఆయన భారీ ధర పలకడం ఖాయమని జోస్యం చెప్పారు.