news

News May 22, 2024

23 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

image

AP: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 27 నుంచి జూన్ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 5వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 5వ తేదీనే ఆప్షన్స్ మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. జూన్ 7న సీట్ల కేటాయింపు.. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

News May 22, 2024

27న హజ్ యాత్ర ప్రారంభం

image

AP: హజ్ యాత్రకు వెళ్లే హాజీల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ హజ్ కమిటీ కార్యనిర్వాహక అధికారి తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు విమానాల్లో యాత్రికులను తీసుకెళ్తామని పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలోని కేసరపల్లిలోని ఈద్గా మసీదు వద్ద వసతి క్యాంపు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరింత సమాచారం కోసం 1800 4257873 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలని కోరారు.

News May 22, 2024

మే 27న సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి

image

TG: నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ MLC స్థానానికి పోలింగ్ జరిగే మే 27న సెలవు ఇవ్వాలని కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్ ECని కోరారు. వర్కింగ్ డే రోజున ఎన్నికలు జరుగుతున్నందున పోలింగ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కోరారు. ఓటర్లు జిల్లాలకు వెళ్లి ఓటేసేలా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. దీనిపై వికాస్‌రాజ్ సానుకూలంగా స్పందించారని వెంకట్ తెలిపారు.

News May 22, 2024

కాళేశ్వరంపై అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం

image

TG: కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు అన్ని వివరాలు ఈ నెల 25లోగా ఇవ్వాలని ఇంజినీర్లను ఇరిగేషన్ శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం, మూడింటికీ ఒకే డిజైన్లు అమలు చేశారా? పనులకు ముందు అధ్యయనం, పని కాకుండానే కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్ ఇవ్వడం, నిర్మాణం, నాణ్యత తనిఖీ సహా ఏ ఒక్క అంశాన్ని దాచొద్దని స్పష్టం చేసింది.

News May 22, 2024

సిట్ నివేదికను బయటపెట్టాలని సీపీఎం డిమాండ్

image

AP: పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో లోపాలున్నాయని సిట్ తేల్చిందన్నారు. FIRలలో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని సిట్ ప్రతిపాదించనట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో నివేదికను బయటపెట్టాలని కోరారు. అప్పుడే పారదర్శకత పెరిగి, ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం ఉంటుందని అన్నారు.

News May 22, 2024

జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు

image

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయనున్నారు.

News May 22, 2024

ఆర్బీఐ నుంచి రూ.2వేల కోట్ల రుణం

image

AP: రిజర్వుబ్యాంకు సెక్యూరిటీల వేలంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు రుణం తీసుకుంది. రూ.1000 కోట్లు 17 ఏళ్ల పరిమితితో తీర్చేలా 7.40 శాతం వడ్డీకి, మరో రూ.1000 కోట్లు 20 ఏళ్ల కాల పరిమితితో 7.38 శాతం వడ్డీకి తీసుకుంది. ఈ నిధులు ఇవాళ ఖజానాకు చేరనున్నాయి.

News May 22, 2024

ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌కు 39వ స్థానం

image

ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్ 39వ స్థానం పొందింది. తొలి స్థానంలో అమెరికా నిలువగా.. స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యయాల పరంగా మన దేశానికి 18వ ర్యాంక్, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు- నౌకాశ్రయాల మౌలిక వసతుల్లో 25వ స్థానం లభించింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్ ముందు స్థాయికి చేరినట్లు WEF నివేదిక పేర్కొంది.

News May 22, 2024

JACKPOT: లాటరీలో రూ. 8.3కోట్లు గెలుచుకుంది

image

పంజాబ్‌కు చెందిన పాయల్ రూ.8.3 కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్నారు. ఇటీవల తమ 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త ఇచ్చిన డబ్బుతో రాఫెల్ టికెట్‌ను ఆమె కొనుగోలు చేశారు. మే 3న 3337 నంబర్ గల లాటరీ టికెట్‌ను కొనుగోలు చేయగా విన్నర్‌గా నిలిచింది. పాయల్ గత పన్నెండేళ్లుగా టికెట్లను కొనుగోలు చేస్తూ వస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం ఇలా లాటరీలు కొనుగోలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

News May 22, 2024

IPL ఫైనల్ చేరే రెండు జట్లివే: ఏబీడీ

image

ఈ IPL సీజన్‌లో ఫైనల్ మ్యాచ్ కేకేఆర్, RCB మధ్య జరుగుతుందని దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఎక్కువగా ఉండటంతో SRH ఆటను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో బెస్ట్ టీమ్ KKR అని చెప్పుకొచ్చారు. KKR ఫైనల్ వెళితే.. చెన్నై వేదికగా జరిగే ఫైనల్లో స్పిన్నర్లు ఉన్న కోల్‌కతాకే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉందన్నారు.