India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ సాయంత్రం వరకు శ్రీసత్యసాయి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 30 మి.మీలకు పైగా వర్షం కురిసినట్లు వెల్లడించింది.
బ్రహ్మోత్సవం, సీత, సత్యభామ సినిమాలు తన టాప్-3 ఫేవరెట్ చిత్రాలని హీరోయిన్ కాజల్ అన్నారు. ‘సత్యభామ’ మూవీ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. బాబు పుట్టిన 2 నెలలకే ‘ఇండియన్-2’ చిత్రం కోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో చాలా పెయిన్ అనుభవించానని తెలిపారు. సత్యభామ సినిమా డేట్స్ విషయంలో డైరెక్టర్ శంకర్ సపోర్ట్‌గా నిలిచారని చెప్పుకొచ్చారు.
సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్న ‘రామాయణ’ 2 పార్టులు కాదు.. 3 పార్టులుగా రానుందట. ఈమేరకు చిత్రయూనిట్ నుంచి విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు టైమ్స్ నౌ పేర్కొంది. మొదటి భాగంలో సీతారాముల కళ్యాణం, రెండో పార్టులో సీతాపహరణం, మూడో పార్టులో సీతను తీసుకురావడం చూపించనున్నట్లు తెలిపింది. మూడు భాగాలను డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కించనున్నారు.
TG: వడ్లకు <<13283753>>బోనస్<<>> విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధం ఆడారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బోనస్ ఇస్తామని చెప్పి గెలిచాక మాట మార్చారని దుయ్యబట్టారు. కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని.. 10 శాతం పండించే సన్న వడ్లకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ సీజన్లో అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఐపీఎల్ క్వాలిఫయర్-1లో SRHకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో 51 శాతం మంది SRHకు అనుకూలంగా, 49 శాతం మంది KKRకు అనుకూలంగా ఓటు వేశారని పేర్కొంది. ఏమైనప్పటికీ మైదానంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలిపింది. రేపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేకేఆర్, SRH మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది.
తనకు 250 జతల దుస్తులున్నాయని గుజరాత్ మాజీ సీఎం అమర్ సిన్హ్ చౌదరీ చేసిన వ్యాఖ్యలే తనపై చేసిన అతిపెద్ద ఆరోపణలు అని ప్రధాని మోదీ అన్నారు. అమర్ సిన్హ్‌ను ఉద్దేశించి రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా.. తాను కావాలా అని కోరితే గుజరాత్ ప్రజలు తననే ఎంచుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత విపక్షాలు తనపై ఆరోపణలు చేసే ధైర్యం చేయలేదని పేర్కొన్నారు.
యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ICC) చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ కోరారు. హమాస్‌తో యుద్ధంలో పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారని ఇజ్రాయెల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నెతన్యాహుపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఐసీసీ విచారణ జరిపే అవకాశముంది.
‘రక్షణ’ ప్రమోషన్లలో హీరోయిన్ <<13279049>>పాయల్ రాజ్‌పుత్<<>> పాల్గొనడం లేదని సినిమా డైరెక్టర్, నిర్మాత ప్రణ్‌దీప్ నుంచి తమకు Mar 28న ఫిర్యాదు అందిందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. ‘అది 4ఏళ్ల క్రితం సినిమా. OTTలో రిలీజ్ చేసుకోండి’ అని ఆమె చెప్పినట్లు ఆ ఫిర్యాదులో ఉంది. సినిమాకు 50రోజుల డేట్స్ ఇచ్చినా.. ఆమె 47 రోజులు మాత్రమే పని చేశారని, ప్రమోషన్స్ చేయాలని అగ్రిమెంట్‌లోనే ఉందని పేర్కొంది.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఆధునీకరించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందుకు రూ.600 కోట్లను కేటాయిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలపై తన అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు మంత్రి చెప్పారు.
TG: మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా నిలబడుతుందనే గ్యారంటీ లేదని NDSA కమిటీ చెప్పిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేస్తామన్నారు. సాంకేతిక కమిటీ సూచనలకు విరుద్ధంగా పనిచేసి ప్రజాధనం వృథా చేయదలుచుకోలేదని చెప్పారు. తాత్కాలికంగా రైతులకు నీరు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.
Sorry, no posts matched your criteria.