news

News May 20, 2024

తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్ ప్రమాణం

image

తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్ తే బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మాజీ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ హయాంలో ఈయన గత నాలుగేళ్లు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా లై చింగ్ చైనాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పరిరక్షణలో తైవాన్ వెనకడుగు వేయదని.. చైనా తన బెదిరింపులను మానుకోవాలన్నారు.

News May 20, 2024

విద్య అంటే ర్యాంకులు కాదు.. విజ్ఞానం: జస్టిస్ ఎన్వీ రమణ

image

AP: భావితరాల భవిష్యత్ అంతా విద్యపైనే ఆధారపడి ఉంటుందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువు అంటే ర్యాంకులు, మార్కులు కాదన్నారు. విజ్ఞానాన్ని పెంచుకోవడమే విద్య ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని సూచించారు.

News May 20, 2024

హీరో రామ్‌తో త్రివిక్రమ్ సినిమా?

image

త్రివిక్రమ్, హీరో రామ్ కాంబోలో స్రవంతి రవికిశోర్ నిర్మాతగా ఓ సినిమా రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ పుష్ప-2, అట్లీతో చేసే ప్రాజెక్టుతో బన్నీ బిజీగా ఉన్నారు. దీంతో ఆలోగా రామ్‌తో మూవీ చేసేందుకు ఓ స్టోరీని సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’లో నటిస్తున్నారు.

News May 20, 2024

ఎడ్‌సెట్ హాల్ టికెట్లు విడుదల

image

TG: ఈనెల 23న జరగనున్న ఎడ్‌సెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ <>డౌన్‌లోడ్<<>> చేసుకోవచ్చు. బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. ఉ.10 నుంచి మ.12 వరకు మొదటి సెషన్, మ.2 నుంచి సా.4 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.

News May 20, 2024

LS PHASE 5: ‘అయోధ్య’ ఓటు ఎవరికి? – 2/2

image

బీజేపీ ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచినా ఎస్‌పీకి ఓట్ షేర్ పెరగడం చర్చనీయాంశమైంది. బీజేపీకి 2014లో 48.08%, 2019లో 48.66% రాగా SPకి 2014లో 20.43%, 2019లో 42.64% నమోదైంది. అయోధ్యలో పర్యాటక రంగం వృద్ధిపై కొందరిలో సంతృప్తి ఉన్నా పేదలను పట్టించుకోలేదనే అసంతృప్తి గ్రామాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేటి పోలింగ్‌లో ఓటర్లు మార్పు కోరుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.<<-se>>#Elections2024<<>>

News May 20, 2024

LS PHASE 5: ‘అయోధ్య’ ఓటు ఎవరికి? – 1/2

image

ఐదో విడత పోలింగ్‌లో యూపీలోని ఫైజాబాద్ ఎంపీ స్థానంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయోధ్య దీని పరిధిలో ఉండటమే కారణం. రామమందిరం ప్రభావంతో మరోసారి గెలుస్తామని BJP ధీమాగా ఉంది. అయితే ఇక్కడ దళిత ఓటర్లది (26%) కీలక పాత్ర. BJP ఎంపీ లల్లూ సింగ్‌కు పోటీగా అవధేశ్ ప్రసాద్‌ను SP బరిలోకి దింపింది. దళిత నేత అయిన ఈయనకు ముస్లిం, యాదవ వర్గాల మద్దతు ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. <<-se>>#Elections2024<<>>

News May 20, 2024

వర్క్ హార్స్.. అత్యంత సమర్థవంతమైన హెలికాప్టర్

image

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌(బెల్-212)ను USకు చెందిన బెల్ టెక్స్‌ట్రాన్ కంపెనీ తయారు చేసింది. ఇందులో సిబ్బంది సహా గరిష్ఠంగా 15 మంది ప్రయాణించవచ్చు. రెండు బ్లేడ్లతో ఉండే ఈ హెలికాప్టర్‌ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాల కోసం వినియోగించుకునేలా రూపొందించారు. కంపెనీ తయారుచేసే కీలక మోడళ్లలో ఇదీ ఒకటి. అత్యంత సమర్థవంతమైనదిగా భావించే ఈ హెలికాప్టర్‌కు ‘వర్క్ హార్స్’గా పేరుంది.

News May 20, 2024

విమాన ప్రమాదాల్లో చనిపోయిన దేశాధినేతలు వీరే..

image

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ <<13279352>>దుర్మరణం<<>> పాలయ్యారు. గతంలోనూ పలువురు దేశాధినేతలు ఇలాంటి ఘటనల్లో మరణించారు. 1936-స్వీడన్ PM లిండ్‌మాన్, 1957- ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే, 1958-బ్రెజిల్ ప్రెసిడెంట్ నెరేయు, 1966-ఇరాక్ అధ్యక్షుడు ఆరిఫ్, 1967-బ్రెజిల్ ప్రెసిడెంట్ బ్రాంకో, 1987-లెబనాన్ PM రషీద్, 1988-పాక్ ప్రెసిడెంట్ జియా ఉల్ హక్ కన్నుమూశారు.

News May 20, 2024

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే. Way2News యాప్‌లో రీఫ్రెష్ చేసిన అనంతరం కనిపించే స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. సులభంగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

News May 20, 2024

GOOD NEWS.. 3-4 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు

image

వైద్య ఖర్చుల కోసం చేసే EPFలో చేసే ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని ₹50వేల నుంచి ₹లక్ష వరకు EPFO పెంచింది. మానవ ప్రమేయం లేకుండా వేగంగా ఆటో సెటిల్‌మెంట్ ద్వారా 3-4 రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఇందుకు గతంలో 10 రోజులు పట్టేది. విద్య, వివాహం కోసం రూల్ 68K ప్రకారం EPFOలో చేరి 7 ఏళ్లు, ఇంటి కోసమైతే 68B ప్రకారం 5 ఏళ్లు పూర్తయ్యాకే ₹లక్ష విత్‌డ్రా చేసుకోవాలి. వైద్యం కోసం ఎప్పుడైనా తీసుకోవచ్చు.