news

News September 12, 2024

పాత పాటలు ఇష్టం.. న్యూస్ ఛానళ్లు చూడని ఏచూరి

image

సీతారాం ఏచూరికి 1960-70ల నాటి హిందీ పాటలంటే ఇష్టం. హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చూసేవారు. న్యూస్ ఛానళ్లు మాత్రం అస్సలు చూడనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేవుడంటే నమ్మకం లేదని, ఆధ్యాత్మిక ఉన్నతికి, మతానికి సంబంధం లేదన్నారు. నాస్తిక ఆధ్యాత్మికతను విశ్వసిస్తా అనేవారు. పొలిటీషియన్ కాకుంటే బహుశా ఎకనామిక్ ఫ్రొఫెసర్, పొలిటికల్ విద్యావేత్త అయ్యేవాడినన్నారు. తనపని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోయేవారు కాదు.

News September 12, 2024

ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: రేవంత్

image

TG: సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని.. ఏచూరి లేని లోటు పూడ్చలేనిదని సీఎం అన్నారు.

News September 12, 2024

రెండు రోజులు వైన్స్ బంద్

image

TG: గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 17 ఉ.6 గంటల నుంచి 18 సా.6 వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులిచ్చారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఇది వర్తించదని పేర్కొన్నారు.

News September 12, 2024

సీతారాం ఏచూరి హైదరాబాద్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందంటే?

image

సీతారాం ఏచూరి బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హై‌స్కూల్లోనే ఆయన టెన్త్ వరకు చదివారు. 1969లో తెలంగాణలో ఉద్యమం ఉద్ధృతం అవ్వడంతో ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన తల్లిదండ్రులు కాకినాడ వాస్తవ్యులు. అందుకే ఆయనకు హైదరాబాద్, TG, APతో అనుబంధం ఎక్కువే. ఈ కారణంతోనే ఎందరో తెలుగువారిని మార్క్సిస్టు పార్టీకి చేరువ చేశారు. జాతీయ నేతలుగా తీర్చిదిద్దారు. TG ఉద్యమంపై ఆయనకెంతో అవగాహన ఉంది.

News September 12, 2024

ఏచూరి.. చట్టసభలో సామాన్యుల గొంతుక

image

అనారోగ్యంతో <<14084560>>కన్నుమూసిన<<>> సీపీఎం దిగ్గజం సీతారాం ఏచూరి సుదీర్ఘకాలం రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. తొలిసారి ఆయన 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఏచూరి చట్టసభలో సామాన్యుల పక్షాన గొంతెత్తారు. ప్రభుత్వాలపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించేవారు. ప్రస్తుత కమ్యూనిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన ఏచూరికి దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు.

News September 12, 2024

23 దంతాలు తొలగించి 12 ఇంప్లాంట్ చేశారు.. చివరికి!

image

సాధారణంగా ఒక్క దంతాన్ని తొలగించి మరొకటి ఇంప్లాంట్ చేసిన నొప్పినే భరించడం కష్టం. కానీ, చైనాకు చెందిన హువాంగ్ సమ్మతితో 23 దంతాలను తీసివేసి 12 దంతాలను ఇంప్లాంట్ చేయడంతో చనిపోయారు. చికిత్స తర్వాత హువాంగ్ నిరంతరం తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఆపరేషన్ పూర్తయిన 13 రోజుల తర్వాత గత నెల 28న హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.

News September 12, 2024

కమ్యూనిస్ట్ దిగ్గజం సీతారాం ఏచూరి ప్రస్థానమిదే..

image

★1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిక
★1977-78లో మూడుసార్లు జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నిక
★1978లో SFI అఖిల భారత జాయింట్ సెక్రటరీగా ఎన్నిక
★1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నిక
★2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
★2015, 18, 22లో సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీగా ఎన్నిక

News September 12, 2024

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్: పంకజ్ జైన్

image

డిసెంబర్ 2021 తర్వాత తొలిసారి క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. మరికొన్నాళ్లు ఇదే రేటు కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు. చమురు ఉత్పత్తిని పెంచాలని OPEC+ దేశాలను ఇండియా కోరడంతోపాటు తక్కువ ఖర్చుతో రష్యా నుంచి కొనుగోళ్లను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.

News September 12, 2024

చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగి..

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. 1952 ఆగస్టు 12న చెన్నైలో ఈ కమ్యూనిస్టు దిగ్గజం జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడ వాసులు. సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్ లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1974లో SFIలో చేరిన సీతారాం, ఏడాది తర్వాత CPM పార్టీలో చేరి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.

News September 12, 2024

నూడిల్స్ తింటున్నారా?

image

నూడిల్స్‌ను తినడం మానుకోవడం మంచిదని ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రమోటర్ బార్బరా ఓ’నీల్ తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారం అందించడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. నూడుల్స్‌లో పోషకాలు శూన్యమని, గోధుమ, సింథటిక్ & MSG, కార్సినోజెనిక్ ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుందని చెప్పారు. నూడుల్స్ తినడం వల్ల జీర్ణాశయంలో మంటగా ఉంటుందని, క్రమంగా రుచిని గుర్తించే స్వభావం తగ్గుతుందన్నారు.