News September 12, 2024
ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: రేవంత్
TG: సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని.. ఏచూరి లేని లోటు పూడ్చలేనిదని సీఎం అన్నారు.
Similar News
News October 5, 2024
పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు!
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ CM ఉదయనిధిపై, మైనారిటీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ఉదయనిధి వ్యాఖ్యల్ని పవన్ ఖండించడాన్ని అడ్వకేట్ తప్పుబట్టారని తెలిపింది.
News October 5, 2024
‘OG’ ఇండస్ట్రీ హిట్ అవుతుంది: తమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా అప్‌డేట్స్ గురించి తనను అందరూ అడుగుతున్నారని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా మూవీని రూపొందిస్తున్నారని, కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని తెలిపారు. త్వరలోనే మూవీ టీమ్ నుంచి అప్‌డేట్స్ వస్తాయన్నారు. అలాగే ‘గేమ్ ఛేంజర్’ నుంచి నెక్స్ట్ విడుదలయ్యే మెలోడీ పాట కూడా అద్భుతంగా వచ్చిందని చెప్పారు.
News October 5, 2024
SC వర్గీకరణ రివ్యూ పిటిషన్లు కొట్టివేత
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన 32 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనలు-2013లోని 47 రూల్ 1 కింద వీటిని సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గత నెల 24నే ఈ ఉత్తర్వులు వెలువడగా తాజాగా బహిర్గతమయ్యాయి.