news

News May 16, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు నేడే లాస్ట్

image

TG: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగియనుంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

News May 16, 2024

పోలీసులు కూటమికి సపోర్ట్ చేసినా జగన్‌దే విజయం: అంబటి

image

AP: రాష్ట్ర పోలీసులు ఎన్డీయే కూటమికి సపోర్ట్ చేసినా మరోసారి వైసీపీనే గెలుస్తుందని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కూటమిలో 4వ పార్ట్‌నర్‌గా పోలింగ్ రోజున ఏపీ పోలీస్ చేరి ఫైట్ చేసినా జగన్ అన్నదే విజయం!’ అని ట్వీట్ చేశారు.

News May 16, 2024

GREAT: ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన మహిళ

image

తన తల్లి మరణం మరో ఐదుగురికి పునర్జన్మనిస్తుందని తెలుసుకున్న లక్ష్మీదేవమ్మ కుటుంబసభ్యులు.. అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. NIMS హాస్పిటల్‌లో ఆమె చనిపోగా.. 2 కిడ్నీలు, కాలేయం & 2 నేత్రాలను దానం చేసినట్లు ‘జీవన్‌దాన్’ ట్వీట్ చేసింది. అన్నిదానాల కంటే అవయవదానం ఎంతో గొప్పది. కానీ, దీనికి చాలా మంది ముందుకురారు. దీంతో అవయవాలు అందుబాటులో లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

News May 16, 2024

నేడు ఐప్యాక్ కార్యాలయానికి సీఎం జగన్

image

ఏపీ సీఎం జగన్ నేడు విజయవాడలోని ఎన్నికల వ్యూహ సంస్థ ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఆ సంస్థ ఆఫీసుకు మ.12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కొన్ని బహుమతులూ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News May 16, 2024

నేటి నుంచి టీబీ నియంత్రణకు టీకా

image

AP: రాష్ట్రంలోని ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నేటి నుంచి క్షయ నియంత్రణ టీకా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే హైరిస్క్ ఉన్న బాధితుల గుర్తింపు ప్రక్రియను వైద్యశాఖ పూర్తి చేసింది. టీబీ చరిత్ర కలిగిన వారితో పాటు రోగుల కుటుంబ సభ్యులు, ధూమపానం చేసేవారు, మధుమేహం వ్యాధిగ్రస్థులు, తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులకు తొలుత టీకాలు వేస్తారు. 12 జిల్లాల్లో ఈ వర్గాల వారు 50 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశారు.

News May 16, 2024

గోల్డ్ మెడల్ సాధించాడు..కానీ!

image

ఫెడరేషన్ కప్‌లో హరియాణా తరఫున బరిలో దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించారు. జావెలిన్‌ను 82.27m దూరం విసిరి ఛాంపియన్‌గా నిలిచారు. కానీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 2021లో ఇదే టోర్నీలో అతను 87.80m విసిరారు. అతని వ్యక్తిగత ఉత్తమం 89.04mగా ఉంది. వీటితో పోలిస్తే తాజాగా విసిరిన దూరం తక్కువ కావడం, త్వరలో ఒలింపిక్స్ ఉండడంతో అతని ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

News May 16, 2024

త్వరలో టీపీసీసీకి కొత్త చీఫ్!.. రేసులో ఉన్నదెవరు?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత TPCCకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు AICC కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కొనసాగుతుండగా, ఈ పోస్టు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. భట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కీ, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్, అంజన్ కుమార్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీతక్క పేరు కూడా వినిపిస్తోంది.

News May 16, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.

News May 16, 2024

కేజ్రీవాల్‌కు ED సమన్లపై జూలై 11న విచారణ

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జూలై 11న విచారణ జరపనున్నట్లు ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. కాగా.. ఈడీ ఇచ్చిన సమాధానంపై బదులివ్వడానికి కేజ్రీవాల్‌కు మరో నాలుగు వారాలు సమయం ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇదే లిక్కర్ కేసులో జైలుకెళ్లిన ఆప్ నేత మనీశ్ సిసోడియా కస్టడీని మే 30 వరకు పొడిగించింది. తదుపరి వాదనలూ అదే రోజు వింటామని కోర్టు పేర్కొంది.

News May 16, 2024

ఈ ఏడాదితో ముగియనున్న కామన్ అడ్మిషన్ల గడువు

image

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం TG విద్యాసంస్థల్లో AP విద్యార్థులకు పదేళ్ల పాటు సీట్లు కల్పించే గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనుంది. దీంతో 2025-26 విద్యాసంవత్సరం నుంచి AP కోటాకు(15%) బ్రేక్ పడనుంది. సీట్లన్నీ TG విద్యార్థులకే ఇవ్వనున్నారు. ఈ ఏడాది నోటిఫికేషన్లన్నీ జూన్‌కు ముందే రావడంతో కామన్ అడ్మిషన్లకు ఛాన్సుంది. ఈసారి TS EAPCET సహా పలు ప్రవేశ పరీక్షలకు AP స్టూడెంట్స్ నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి.