News September 12, 2024

మనుషుల నుంచీ కాంతి వెలువడుతోంది!

image

మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్రా-సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి, మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బంధించారు.

Similar News

News October 5, 2024

ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు.. కారణం అదే!

image

యూపీలోని అమేథీలో గురువారం ఇద్దరు పిల్లలు సహా దంపతులను హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. నిందితుడు చందన్ వర్మ.. సునీల్ కుమార్ (35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు అతడి భార్య పూనం (32), ఇద్దరు చిన్న పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం సూసైడ్ చేసుకునేందుకు యత్నించగా మిస్ ఫైర్ అయి బతికిపోయాడు. చందన్, పూనం మధ్య వివాహేతర సంబంధం ఉందని, విభేదాలతో ఆమె కేసు పెట్టడమే దీనికి కారణమని పోలీసులు గుర్తించారు.

News October 5, 2024

ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తా: గోపీచంద్

image

తాను చేసిన విలన్ పాత్రలు బలమైన ముద్ర వేశాయని, అందుకే ఫ్యాన్స్ తనను మళ్లీ ఆ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారని హీరో గోపీచంద్ అన్నారు. ప్రభాస్ సినిమాలో అయితేనే తాను విలన్‌గా నటిస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కొన్ని సినిమాల రిజల్ట్ రిలీజ్‌కు ముందే తెలిసిపోతుందని, కానీ నమ్మకంగా ప్రమోషన్ చేస్తామని చెప్పారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆయన నటించిన ‘విశ్వం’ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది.

News October 5, 2024

భయానకం.. 600 మందిని కాల్చేశారు

image

ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో భయానక ఘటన చోటుచేసుకుంది. బర్సాలోగోలో అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థ JNIM దాడుల్లో గంటల వ్యవధిలోనే 600 మంది ప్రజలు చనిపోయారు. AUG 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌లపై వచ్చిన దుర్మార్గులు కనిపించినవారినంతా కాల్చేశారు. ఆ మృతదేహాలను తొలగించడానికి 3 రోజలు పట్టింది. ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య 2015 నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 20వేల మంది మరణించారు.