India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళా రెజ్లర్ల సంఖ్య పెరుగుతోంది. 2012లో ఒక్కరు మాత్రమే ఒలింపిక్స్‌లో పోటీపడగా, ఆ తర్వాత 2016లో ముగ్గురు, 2020లో నలుగురు క్వాలిఫై అయ్యారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు ఐదుగురు ఎంపికయ్యారు. దీంతో దేశంలో మహిళల రెజ్లింగ్ పురోగతి సాధిస్తోందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మెడల్(2016-బ్రాంజ్) మాత్రమే గెలిచిన మహిళా రెజ్లర్లు ఈసారి ఎన్ని మెడల్స్ గెలుస్తారో చూడాలి.
వాట్సాప్‌లో ‘ఆటోప్లే యానిమేటెడ్ ఇమేజెస్’ పేరుతో ఓ ఫీచర్ రానుంది. ఎమోజీ, స్టికర్స్, అవతార్స్‌కు సంబంధించి యానిమేషన్స్‌ను ఈ ఫీచర్‌తో కంట్రోల్ చేయవచ్చు. డిజేబుల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. మన ప్రాధాన్యతకు తగ్గట్లుగా యాప్‌లో చాట్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటును తీసుకురానున్నారు. GIFs విషయంలో మాత్రం ఇది పనిచేయదు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
కుటుంబమంతా కలిసి చూసే విలువలతో కూడిన కంటెంట్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుందట. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను చూపించడమే లక్ష్యంగా ఇందులోని కంటెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్‌ను ఇందులో కవర్ చేస్తారట. ఏడాది లేదా రెండేళ్లు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ ధరలు నిర్ణయిస్తారని సమాచారం.
AP: కూటమి భారీ విజయంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని గ్రహించే నిన్న వైసీపీ దాడులకు తెగబడిందని ఆరోపించారు. కసి, కోపం, బాధతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని తెలిపారు. విజయవాడ పార్లమెంటులో అన్ని అసెంబ్లీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని చిన్ని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోదని చెప్పారు. యూపీ ప్రజలు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరని అన్నారు. వారి జీవితాలను మార్చిన ప్రత్యామ్నాయ మోడల్‌ను ఎంచుకుంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
బాలీవుడ్ సీనియర్ నటి టబు హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశారు. ప్రముఖ మూవీ సిరీస్ ‘డ్యూన్’ పార్ట్-3లో ఆమె నటించనున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం సినిమాలో టబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్‌గా నిలిచాయి.
IPLలో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న వేళ BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ‘భారత జట్టు అత్యుత్తమమైనది. ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుతంగా ఆడతాడు. బిగ్ టౌర్నమెంట్స్‌లో రోహిత్ తన బెస్ట్ ఇస్తాడు. కాబట్టి ఫ్యాన్స్ అతని ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని గంగూలీ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది.
రామ్ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 85 సెకండ్ల నిడివితో ఈ టీజర్ ఉంటుందని తెలిపారు. పార్ట్-1 కంటే రెండు రెట్లు ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఏపీలో కాలువల నిర్వహణ పనులపై గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఎన్నికలు ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించి, మరమ్మతుల పనులను వేసవి ముగిసేలోగా పూర్తిచేయాలి’ అని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ 2010లో నమోదైన కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో 2010లో బాబును MH పోలీసులు అరెస్ట్ చేసి ధర్మాబాద్ జైలులో ఉంచారు. అక్కడి నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో సిబ్బందిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ కేసులో CBN, ఆనంద్ బాబుపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.