India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రితం సెషన్లో రికార్డులు బద్దలుకొట్టిన బెంచ్‌మార్క్ సూచీలు నేడు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. BSE సెన్సెక్స్ 125 పాయింట్లు తగ్గి 82,844 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ 42 పాయింట్లు ఎరుపెక్కి 25,346 వద్ద ట్రేడవుతోంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 18:32గా ఉంది. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విప్రో, టాటా స్టీల్, JSW స్టీల్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మూవీ మిస్ కావడం తనను బాధించిందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ‘నా కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ చేశా. షూటింగ్ అనంతరం ఢిల్లీ వెళ్లా. తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు. నా స్థానంలో వేరొకరిని తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసింది. ప్రభాస్‌తోనే చేయాల్సిన మరో మూవీ షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు’ అని ఆమె చెప్పారు.
TG: MLAలు అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మాటల యుద్ధంతో హైదరాబాద్‌లో నెలకొన్న హైటెన్షన్ వాతావరణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. రెచ్చగొట్టి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఢిల్లీ నుంచి ఆయన ఆరా తీశారు.
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో విజయనగరం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, భోజనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పారు. ఇవాళ హెలికాప్టర్ రావాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించకపోవడంతో మరో 2 రోజులు అక్కడే ఉండాల్సి రావొచ్చని అధికారులు తెలిపారు.
శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మత్తు వదలరా-2’ థియేటర్లలో రిలీజైంది. ప్రీమియర్స్ చూసిన వాళ్లు Xలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సత్య కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారంటున్నారు. చిరంజీవి రిఫరెన్స్ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు డైరెక్టర్ మీమ్స్ స్టఫ్‌ను వాడుకున్నారంటున్నారు.
>> మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ
TG: బీఆర్ఎస్ నిజమైన బలం కేడర్‌లోనే ఉందని కార్యకర్తలు మరోసారి నిరూపించారని కేటీఆర్ అన్నారు. ‘నిన్న కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు. రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్లు రువ్వినా, దాడులను పోలీసులు ఆపకపోయినా ధైర్యంగా పోరాడారు. వారితో పాటు సోషల్ మీడియాలో అండగా నిలిచిన వారందరికీ వందనాలు’ అని ట్వీట్ చేశారు.
ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చెక్ చేసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెట్ ఆన్ చేయగానే నోటిఫికేషన్లు వస్తాయి. వాటిలో నెగటివ్ సమాచారమూ ఉంటుంది. ఇది చూసి ఆందోళనపడతారు. సోషల్ మీడియా వల్ల హ్యాపీ హార్మోన్ విడుదలై ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్యుత్పత్తి సమస్యలు తలెత్తి సంతానలేమికి దారి తీస్తుంది. ఫోన్ వాడకం శృంగార జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఫోన్ల నుంచి వచ్చే కాంతితో పలు సమస్యలు వస్తాయి.
TG: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో మూడు రోజులుగా పౌర సేవలు నిలిచిపోయాయి. పోర్టల్ పనిచేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన సర్వర్‌లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని, మరో రెండు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ భేటీ కానున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన రూ.50లక్షల విరాళాన్ని నేరుగా అమరావతిలో సీఎంను కలిసి అందజేయనున్నారు. టీడీపీ, తారక్ మధ్య కొన్నేళ్లుగా గ్యాప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కానుండడం ఆసక్తి నెలకొంది.
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, నాని ఓకే చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని హిట్-3తో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.