News September 13, 2024
‘మత్తు వదలరా-2’ మూవీ పబ్లిక్ టాక్
శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మత్తు వదలరా-2’ థియేటర్లలో రిలీజైంది. ప్రీమియర్స్ చూసిన వాళ్లు Xలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సత్య కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారంటున్నారు. చిరంజీవి రిఫరెన్స్ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు డైరెక్టర్ మీమ్స్ స్టఫ్‌ను వాడుకున్నారంటున్నారు.
>> మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ
Similar News
News October 15, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?
దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.
News October 15, 2024
కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు
కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.
News October 15, 2024
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం
AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. నకిలీ బిల్లులతో కొనుగోళ్లు జరిపినట్లు, వ్యక్తిగత ఖాతాలకు ఈ సంస్థ నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే కేసులో గతేడాది చంద్రబాబు జైలుకెళ్లారు.