India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➣TG: వడ్డీ చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
➣టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
➣మా జోలికి వస్తే ఒళ్లు చింతపండు అయితది: రేవంత్
➣100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా?: హరీశ్
➣AP: మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు: జగన్
➣రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం
➣రాజధాని రైతులకు కోరుకున్న చోట స్థలాలు: మంత్రి నారాయణ
➣విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం కుట్ర: బొత్స
బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జావెలిన్ త్రో స్టార్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను తాను విరిగిన చేతితో ఆడాడని X ద్వారా వెల్లడించారు. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డానని, ఎక్స్ రేలో తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తెలిపారు. డాక్టర్ల సహకారంతో ఫైనల్ ఆడగలిగాని తెలిపారు. ఆట పట్ల అతడికున్న నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
AP: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా GOVT కొత్త లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2019 కంటే ముందు APలో అమలైన పాలసీనే మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విధివిధానాలను క్యాబినెట్ సబ్ కమిటీ దాదాపు ఖరారు చేసింది. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని కమిటీ నిర్ణయించింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత OCT 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే అవకాశముంది.
ప్రస్తుత NDA పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో మోదీ 3.0 పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై తన ప్రసంగంలో మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది.
తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్‌లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్‌తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌లో బాషా పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.
AP: ఏపీలోని 35 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా <
NTR, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా ఔట్ డోర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల నుంచి అనుమతి రాలేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. కాగా ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మరోసారి కొండెక్కాయి. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కొత్తిమీర, పుదీనా కట్టలు రూ.60-రూ.100 పలుకుతున్నాయి. కిలో ఉల్లి రూ.60-80, పచ్చిమిర్చి 70, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.80, బెండ రూ.70, క్యారెట్ రూ.100, కాకర రూ.80, టమాటా రూ.40-50 పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికోలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ సమావేశాల్లో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఈ ఆహ్వానం అందటం తనకు ఎంతో గర్వకారణమని భట్టి ఆనందం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.