News September 15, 2024

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మరోసారి కొండెక్కాయి. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కొత్తిమీర, పుదీనా కట్టలు రూ.60-రూ.100 పలుకుతున్నాయి. కిలో ఉల్లి రూ.60-80, పచ్చిమిర్చి 70, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.80, బెండ రూ.70, క్యారెట్ రూ.100, కాకర రూ.80, టమాటా రూ.40-50 పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

Similar News

News October 4, 2024

26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్: హోంమంత్రి

image

AP: ప్రతి జిల్లాలో ఒక ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉప సంఘం నిన్న సచివాలయంలో సమావేశమైంది. ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచి యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు చేపడతామని హోంమంత్రి తెలిపారు. ఫిర్యాదుల కోసం 1908 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

News October 4, 2024

ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో ఉంటారా?: వైసీపీ

image

AP: Dy.CM పవన్ తిరుపతి సభపై YCP విమర్శలు చేసింది. ‘ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో అందరికీ దూరంగా ఉంటారా? వరదల టైమ్‌లో బయటకు రాని ఈయన కొత్తగా మత రాగం ఎత్తుకున్నాడు. అసెంబ్లీలో కులమతాలకు అతీతంగా ప్రమాణం చేసి ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం డిక్లరేషన్ ఏమిటి? ప్రచారం కోసం మొన్నటిదాకా తిరుపతి లడ్డూను అవమానించారు. ఇప్పుడు రాజకీయం కోసం మత ధర్మాన్ని బారికేడ్ల మధ్యలోకి తెచ్చారు’ అని ట్వీట్ చేసింది.

News October 4, 2024

మంత్రి అలా మాట్లాడటం సిగ్గుచేటు: అశ్విని వైష్ణవ్

image

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనను సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ‘ఒక మంత్రి ఇలా సినీ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఫిల్మ్ ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దీనిపై రాహుల్ గాంధీ, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటం చూస్తుంటే వారు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు అర్థం అవుతోంది’ అని ట్వీట్ చేశారు.