India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిహార్‌ను ఎన్ని సమస్యలు వెంటాడుతున్నా మోదీకే మరోసారి ఓటేస్తామని ఓబీసీ/అగ్రవర్ణాల ఓటర్లు, మోదీ మద్దతుదారులు చెబుతున్నారట. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై కొందరు పెదవి విరుస్తున్నా అధికశాతం మంది మోదీకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ప్రత్యామ్నాయం లేదని, ఈ పరిస్థితికి వ్యాపారవేత్తలే కారణమని చెబుతున్నారు. కొందరు మాత్రం మార్పు కోరుకుంటున్నారట. <<-se>>#Elections2024<<>>
AP: అల్లూరి జిల్లాలో దేవర షూటింగ్ యూనిట్‌పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 18 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం డ్రోన్ ఎగరవేయగా.. ఆ శబ్దానికి తేనెటీగలు ఎగిరాయని తెలుస్తోంది.
TG: రైతు బంధు(భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసింది. కాగా ఈనెల 9లోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల నిధులను కూడా ఈసీ అనుమతితో ప్రభుత్వం విడుదల చేసింది.
వేసవిలో చాలా చోట్ల ఏసీలను విరివిగా ఉపయోగిస్తుంటారు. ఏసీలోని రిఫ్రిజిరెంట్ గ్యాస్ గదిలోని వాతావరణాన్ని చల్లబరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ గ్యాస్ లీక్ వల్ల కూలింగ్ తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణాలు కండెన్సర్లు తుప్పుబట్టడం, బయట, లోపల డ్యామేజీలు, ఇన్‌స్టాలేషన్ సమస్యలు, పిన్ హోల్ లీక్స్. ఈ లీకేజీని నివారించడానికి కాపర్ కండెన్సర్ల వాడకం, ఎండ తగలని చోట ఇన్‌స్టాలేషన్, తరుచుగా మెయింటెనెన్స్ చేయాలి.
ఒకప్పుడు గూగుల్‌లో పప్పు అని సెర్చ్ చేస్తే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫొటోలు దర్శనమిచ్చేవి. రాహుల్ గాంధీని ‘పప్పు’ అని ప్రత్యర్థులు తరచూ సంబోధించడమే ఇందుకు కారణం. అతడికి దేశాన్ని పాలించే సత్తా లేదనే ఉద్దేశంతో ట్యూబ్‌లైట్, మహాజ్ఞాని అని కూడా బిరుదులు ఇచ్చారు. అయితే.. ఈసారి పంథా మార్చుకొని రాహుల్‌కు ‘యువరాజు’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. మోదీ సైతం రాహుల్‌పై ‘యువరాజు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
AP అభివృద్ధికి ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని అనకాపల్లి సభలో చంద్రబాబు వెల్లడించారు. ‘రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో మోదీ, అమిత్ షా చెప్పారు. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయం. అధికారం ఉందని జగన్ విర్రవీగారు. 25 లోక్‌సభ, 160 ఎమ్మెల్యే సీట్లలో కూటమిదే విజయం’ అని CBN విశ్వాసం వ్యక్తం చేశారు.
విశాఖ కేంద్రంగా APకి ప్రత్యేక రైల్వే జోన్‌ను కేటాయిస్తే.. దానికి ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘కేంద్రం 24 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నిర్మించలేదు. తన తండ్రి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకుంటున్నారు. APలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఆలయాలను రక్షిస్తాం’ అని భరోసా ఇచ్చారు.
ధుబ్రీ (అస్సాం)- ఫుల్‌వారీ (మేఘాలయ) మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. 20KM పొడవున నిర్మించనున్న ఈ బ్రిడ్జ్ 2027లో అందుబాటులోకి రానుంది. దీంతో గంటల కొద్దీ బోటు ప్రయాణం తప్పడమే కాక దాదాపు 200KM దూరం తగ్గనుంది. 2021లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా, ఈ క్రెడిట్ తమదేనని NDA, AIUDF, కాంగ్రెస్ చెప్పుకుంటున్నాయి. <<-se>>#Elections2024<<>>
ఈ IPLలో PBKS ఆటపై అభిప్రాయం చెప్పాలన్న నెటిజన్ ప్రశ్నకు జట్టు కో ఓనర్ ప్రీతిజింటా Xలో స్పందించారు. ‘మాకు సంతోషంగా లేదు. చివరి బంతి వరకు వచ్చి 4 మ్యాచ్‌లలో ఓడిపోయాం. గాయం కారణంగా కెప్టెన్ ధవన్ ఆడట్లేదు. కొన్ని మ్యాచ్‌లను అద్భుతంగా ఆడాం. కొన్నింటిలో మా మార్క్‌ను చేరుకోలేకపోయాం. హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌లలోనూ గెలిస్తే ముందుకెళ్లగలం. మాకు సపోర్టుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
డిప్లమాటిక్ పాస్ పోర్టును ‘టైప్ డీ’ పాస్ పోర్టు అని కూడా అంటారు. దీనిని దౌత్యవేత్తలు, ప్రభుత్వం తరఫున అధికారిక ప్రయాణాలు చేసే వారికి జారీ చేస్తారు. ఈ పాస్ పోర్టు మెరూన్ కలర్‌లో ఉంటుంది. ఇది కలిగిన వ్యక్తులకు వీసా ప్రక్రియ, ప్రయాణం సులభతరం అవుతుంది. సెక్స్ వీడియోల కేసులో కీలక నిందితుడైన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ పాస్ పోర్టుతోనే దేశం విడిచి జర్మనీ పారిపోయారు. ఎంపీగా ఉండటంతో ఆయన ఈ పాస్ పోర్ట్ పొందారు.
Sorry, no posts matched your criteria.