India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: మే 4, శనివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:32
సూర్యోదయం: ఉదయం గం.5:49
జొహర్: మధ్యాహ్నం గం.12:13
అసర్: సాయంత్రం గం.4:40
మఘ్రిబ్: రాత్రి గం.6:37
ఇష: రాత్రి గం.07.54
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: మే 4, శనివారం
బ.ఏకాదశి: రాత్రి 08:39 గంటలకు
పూర్వాభద్ర: రాత్రి 10:07 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 05:41 నుంచి 07:23 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 05:58 నుంచి 07:26 గంటల వరకు
AP: చంద్రబాబు సూపర్-6లో రూ.4వేల పెన్షన్ మాయం: సీఎం జగన్
25 ఎంపీ స్థానాలూ గెలుస్తాం: చంద్రబాబు
సీఎం జగన్‌కు వెన్నులో భయం తెప్పించాలి: పవన్
TG:బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది: సీఎం రేవంత్
TG:అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై హైకోర్టు స్టే
మోదీ హయాంలో దేశం నాశనం: కేసీఆర్
HYDను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర: హరీశ్
IPL.. ముంబైపై KKR విజయం
AP: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. అయితే బ్యాంకు అకౌంట్లు యాక్టివ్‌గా లేని 74,399 మందికి డీబీటీ ద్వారా నగదు జమ కాలేదు. వీరందరికీ నేరుగా నగదును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను పెన్షన్ యాప్ నందు అప్‌డేట్ చేశారు. వీరందరికీ పెన్షన్లు అందజేసే ప్రక్రియను 4, 5 తేదీల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
భారీ అంచనాలతో వస్తోన్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఏకంగా రూ.700కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు డిజిటల్ రైట్స్ సైతం ఓ రేంజ్‌లో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.200 కోట్లకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఓటమి పాలైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సూర్యకుమార్(56) మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 145 పరుగులకే ఆలౌటైంది. KKR బౌలర్లలో స్టార్క్ 4, వరుణ్, నరైన్, రసెల్ తలో 2 వికెట్లు తీశారు. ఈ పరాజయంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
‘కేజీఎఫ్’ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నయనతార నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆమె యశ్‌కు సోదరిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదట ఈ పాత్రలో కరీనా కపూర్ నటిస్తున్నట్లు ప్రచారం జరగగా, డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు సమాచారం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
TG: ఎన్నికల తర్వాత BJPతో కలవడానికి BRS సిద్ధమైందని సీఎం రేవంత్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని సిరిసిల్ల సభలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా KCR సహకరించారని, తన కూతురు కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. డిసెంబర్‌లో జరిగిన సెమీస్‌లో బీఆర్ఎస్‌ను ఓడించామని, ఫైనల్‌లో మోదీని ఓడించాలని వ్యాఖ్యానించారు.
TG: దేశంలో సంచలనం సృష్టించిన HCU స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇవాళ ఉదయం ఆ కేసును <<13173448>>ముగించినట్లు<<>> పోలీసులు ప్రకటించగా, వర్సిటీలో విద్యార్థులు <<13175252>>ఆందోళనకు<<>> దిగారు. దీంతో కేసును రీఓపెన్ చేయాలని రాష్ట్ర డీజీపీ నిర్ణయించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ పోలీస్ శాఖ రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
Sorry, no posts matched your criteria.