India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఛత్తీస్‌గఢ్‌లోని చింద్‌బాహార్(D) దార్భా(V)లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఈశ్వర్ కొన్నేళ్ల కిందట క్రైస్తవంలోకి మారారు. అనారోగ్యంతో ఇటీవల మరణించారు. మతం మారిన కారణంతో గ్రామస్థులు అతడి అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో ఓ మెడికల్ కాలేజీలోనే 4రోజులు డెడ్ బాడీ ఉండిపోయింది. ఈశ్వర్ కొడుకు సార్తిక్ హైకోర్టును ఆశ్రయించారు. గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
ఏపీ వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూ.గో జిల్లా అనపర్తి సహా పలుచోట్ల ఉదయం నుంచే అధికారులు ఇళ్లకు వెళ్లి 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల నుంచి ఓట్లు స్వీకరిస్తున్నారు. హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ నెల 10వ తేదీ వరకు వెళ్లి అధికారులు ఓట్లు స్వీకరిస్తారు. అటు తెలంగాణలో రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా IT రంగంలో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఈ ఏప్రిల్‌లో ఏకంగా 21వేల మంది ఇంటిబాటపట్టారు. టెస్లా (14K), టర్కీ డెలివరీ కంపెనీ జెటిర్ (6K), యాపిల్ (600) కంపెనీలు ఎక్కువ మందిని తొలగించాయి. 2024 తొలి 4 నెలల్లో 271 కంపెనీలు 78K మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. కోవిడ్ ముందు, ఆ సమయంలో జరిగిన ఓవర్ హైరింగ్, AIపై పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టుల కొరత వంటివి దీనికి ప్రధాన కారణాలనేది నిపుణుల అభిప్రాయం.
ప్రపంచ జనాభా 800 కోట్లకు పైగా ఉండగా అందులో O+ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు 42 శాతంగా ఉన్నట్లు ఓ నివేదిక పేర్కొంది. తర్వాత A+:31%, B+:15%, AB+:5%, O-:3%, A-: 2.5%, B-:1%, AB-:0.5 శాతంగా ఉన్నట్లు వివరించింది. ఇక INRA రక్త వర్గం ప్రపంచంలో పది మంది కంటే తక్కువ వ్యక్తుల్లో ఉంటుందట. ఏ బ్లడ్ గ్రూపు వారికి రక్తం ఇవ్వచ్చు.. ఏ గ్రూపు వారి నుంచి రక్తం తీసుకోవచ్చో పై గ్యాలరీలో చూడొచ్చు.
JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారం సంచలనమైన వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘యథావిధిగా ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారు. ఆయన మౌనంగా ఇస్తున్న మద్దతుతో క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వందలాది ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసిన అతను దేశం విడిచి అంత సులువుగా ఎలా పరారయ్యాడు? మోదీతో చేతులు కలిపితే క్రిమినల్స్ భద్రతకు గ్యారంటీ దక్కినట్టా?’ అని మండిపడ్డారు.
సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ఐఫోన్‌లో అలారం మోగక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య ఉన్నట్లు నిర్ధారించిన యాపిల్ సంస్థ పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిందని BBC తెలిపింది. అయితే.. సమస్య ఎందుకు వస్తోంది? యూజర్లు ఏం చేయాలి? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. 2015లోనూ అలారం సమస్యే రాగా.. అప్పుడు దీనికి పరిష్కారంగా యాపిల్ ఓ అప్డేట్ ఇచ్చింది.
రుణాల వడ్డీ విషయంలో బ్యాంకులు రుణగ్రహీతలను 4 అంశాల్లో భారీగా మోసం చేస్తున్నాయి. 1.రుణం అందిన రోజు కాకుండా అనుమతి పొందిన రోజు నుంచే వడ్డీ వసూలు చేయడం, 2. చెక్ డబ్బు జమ అయినప్పటి నుంచి కాకుండా, ఇష్యూ తేదీ నుంచి వసూలు చేయడం, 3. రుణం చెల్లించే తేదీ కాకుండా, మొత్తం నెలకు వడ్డీ వసూలు చేయడం, 4. కొన్నిసార్లు ఒక వాయిదా సొమ్ము అడ్వాన్స్‌గా తీసుకుంటున్నాయి. దీంతో ఇటీవల RBI కీలక <<13149063>>ఆదేశాలు<<>> ఇచ్చింది.
చంద్రుడిపై 4G నెట్‌వర్క్ స్థాపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా చేతులు కలిపాయి. ఇది భవిష్యత్తులో కమ్యూనికేషన్ వ్యవస్థలో ఓ మైలురాయి కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నోకియాకు చెందిన బెల్ ల్యాబ్స్ స్పేస్ హార్డెన్డ్ LTE సొల్యూషన్‌ను అభివృద్ధి చేసే పనిలో పడింది. 4G నెట్‌వర్క్ స్థాపిస్తే చంద్రుడిపై నుంచి వాయిస్, వీడియో, డేటా మార్పిడి సులభతరం కానుంది.
ఎన్నికలంటేనే హామీల వర్షాలు. ఒక పార్టీని మించి మరో పార్టీ ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తుంటాయి. ఒక్కోసారి హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి ప్రజలే ఇన్ని హామీలు అడుగుతున్నారా? పార్టీలే ప్రజలను హామీల ఉచ్చులో పడేస్తున్నాయా? అంటే ఎవరూ దానికి సమాధానం చెప్పలేరు. రాష్ట్రాలను సంక్షోభంలోకి నెట్టే ఈ హామీలపై మీరేమంటారు? ప్రజలకు ఏమి అవసరమో కామెంట్ చేయండి.
కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.