news

News September 19, 2024

రవిచంద్రన్ అశ్విన్‌.. ది ఆల్‌రౌండర్!

image

చెన్నై టెస్టులో సెంచరీతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజమైన ఆల్‌రౌండర్‌ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. బౌలర్‌గా 500 వికెట్లు, బ్యాటర్‌గా పలు సెంచరీలు, యూట్యూబర్, క్రికెట్ అనలిస్ట్, చెస్ ఆటగాడు, ట్విటర్‌ ట్రోలర్, నాన్-స్ట్రైకర్ రన్ ఔట్ స్పెషలిస్ట్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఈరోజు 102 రన్స్‌ చేసిన ఆయన రేపు డబుల్ సెంచరీ కూడా పూర్తి చేయాలని విష్ చేస్తున్నారు.

News September 19, 2024

AP: స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పుడంటే?

image

తెలంగాణలో స్కూళ్లకు దసరా <<14141736>>సెలవులు <<>>ప్రకటించడంతో ఏపీలో ఎప్పట్నుంచి ఉంటాయనే చర్చ మొదలైంది. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమై అక్టోబర్ 13తో ముగుస్తాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతికి సెలవు కాగా.. 3వ తేదీన వర్కింగ్ డేగా ఉండనుంది. ఇటీవల వర్షాలతో పలు జిల్లాల్లో 5-6 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని సమాచారం.

News September 19, 2024

లడ్డూ విషయంలో దేవుడు క్షమించడు: బండి

image

లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం అంటే తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. హిందువులకు జరిగిన ఈ ద్రోహాన్ని దేవుడు క్షమించడని అన్నారు. ఈ లడ్డూ వ్యవహారంలో AP ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

News September 19, 2024

జానీ మాస్టర్ దేశం కోసం ప్రాణాలైనా ఇస్తారు: భార్య సుమలత

image

TG: తన భర్త జానీ మాస్టర్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలు అవాస్తవమని ఆయన భార్య సుమలత అన్నారు. ఆయనపై కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ‘లవ్ జిహాదీ అని ఏదేదో అంటున్నారు. నా భర్త అలాంటి వ్యక్తి కాదు. ఆరోపణలు రుజువైతే జానీని వదిలేసి వెళ్తా. ఆ అమ్మాయికి చాలామందితో అఫైర్ ఉంది. అవార్డ్ వచ్చినప్పటి నుంచి కావాలనే జానీని టార్గెట్ చేశారు. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి నా భర్త.’ అని ఆమె పేర్కొన్నారు.

News September 19, 2024

భారత చెస్ జట్లు అదుర్స్!

image

చెస్ ఒలింపియాడ్‌ -2024లో భారత చెస్ జట్లు అదరగొడుతున్నాయి. టోర్నీ ప్రథమార్థం తర్వాత ఓపెన్, మహిళల జట్లూ అజేయంగా నిలిచి మొదటిస్థానంలో నిలిచాయి. రెండు జట్లూ వరుసగా చైనా, జార్జియాను ఓడించి 14 మ్యాచ్ పాయింట్లను సాధించాయి. ఇంకా నాలుగు రౌండ్‌లు మిగిలి ఉండగా, రెండు విభాగాల్లోనూ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మరిన్ని విజయాలు భారత్ కైవసం కావాలని నెటిజన్లు కోరుతున్నారు.

News September 19, 2024

కంటిచూపు మెరుగుపడాలంటే..

image

*పాలకూర, తోటకూర, కొలార్డ్ గ్రీన్స్ లాంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
* విటమిన్ E ఎక్కువగా ఉండే బాదం, పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ విత్తనాలు తినాలి.
*స్వీట్ పొటాటోల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
*ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష లాంటి సిట్రస్ పండ్లతో పాటు క్యారెట్లు తినాలి.

News September 19, 2024

ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండో పడవ తొలగింపు

image

AP: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన రెండో పడవను ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత ఇవాళ విజయవంతంగా తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువకు తరలించారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్న మరో భారీ, మోస్తరు పడవ రేపు ఒడ్డుకు తరలిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.

News September 19, 2024

అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో రూ.15వేలు!

image

మార్కెట్‌లో ఎన్నో బియ్యం రకాలున్నాయి. ప్రస్తుతం సాధారణ సన్న బియ్యం ధర క్వింటాకు రూ.5-6 వేలు ఉండొచ్చు. అయితే, అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారన్న విషయం తెలుసా? జపనీస్ కిన్మెమై రైస్ కిలోకు రూ.15వేలు ధర ఉంటుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్ధతిని ఉపయోగించి దీనిని పండిస్తారు. ఈ ప్రీమియం రైస్‌లో ఉన్నతమైన రుచి, పోషక విలువలు ఉన్నాయి. జపాన్ వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది.

News September 19, 2024

వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు

image

వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని భారత్ సహా పలు దేశాల పరిశోధకులు చేసిన సంయుక్త అధ్యయనంలో తేలింది. ‘బ్రెయిన్ స్ట్రోక్‌’ మరణాల్లో 14శాతం వాయు కాలుష్యం వల్లేనని వారు పేర్కొన్నారు. గగనతల కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వలన గత 3 దశాబ్దాల్లో మెదడు సంబంధిత మరణాలు బాగా పెరిగాయని వివరించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య 1990తో పోలిస్తే 2021 నాటికి 70 శాతం పెరిగిందని తెలిపారు.

News September 19, 2024

మీ ఇంట్లో ఫ్రిజ్ శుభ్రం చేయకపోతే మహిళల్లో ఈ సమస్యలు!

image

మ‌హిళ‌ల్లో యూరిన‌రీ స‌మ‌స్య‌లు (UTI) ఇంట్లోని ఫ్రిజ్ వ‌ల్ల కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని US అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల ఎస్చెరిచియా కోలై (E-Coli) అనే బ్యాక్టీరియా ఏర్ప‌డి అది ఇత‌ర ప‌దార్థాల‌కు వ్యాపించే ప్ర‌మాదం ఉంది. దీంతో UTI సమస్యలు వస్తున్నట్టు అంచనా వేసింది. ఇంట్లోని ఫ్రిజ్‌ను త‌ర‌చుగా శుభ్రం చేయ‌డం మహిళల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.