News September 19, 2024

రవిచంద్రన్ అశ్విన్‌.. ది ఆల్‌రౌండర్!

image

చెన్నై టెస్టులో సెంచరీతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజమైన ఆల్‌రౌండర్‌ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. బౌలర్‌గా 500 వికెట్లు, బ్యాటర్‌గా పలు సెంచరీలు, యూట్యూబర్, క్రికెట్ అనలిస్ట్, చెస్ ఆటగాడు, ట్విటర్‌ ట్రోలర్, నాన్-స్ట్రైకర్ రన్ ఔట్ స్పెషలిస్ట్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఈరోజు 102 రన్స్‌ చేసిన ఆయన రేపు డబుల్ సెంచరీ కూడా పూర్తి చేయాలని విష్ చేస్తున్నారు.

Similar News

News October 10, 2024

ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపు రాత్రి 7 గంటలతో ముగియనుంది. షాపులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. అమెరికా నుంచి అత్యధికంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా నిన్నటి వరకు 57 వేల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 10, 2024

OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ

image

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘స్త్రీ-2’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల 26 నుంచి రెంటల్(రూ.349) పద్ధతిలో అందుబాటులో ఉండగా, ఇవాళ్టి నుంచి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఫ్రీగా వీక్షించవచ్చు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.700 కోట్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.

News October 10, 2024

‘మీషో’ ఆఫర్.. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు

image

ఫెస్టివల్ సీజన్‌లో మెగా సేల్స్‌తో కష్టపడిన ఉద్యోగులకు ఈ కామర్స్ సంస్థ మీషో గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా నాలుగో ఏడాది 9 రోజులపాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ‘రెస్ట్ అండ్ రీఛార్జ్’ బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని తెలిపింది. ‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్ ఉండవు. ఈమెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు’ అని పేర్కొంది.