news

News May 2, 2024

ఈనెల 6 నుంచి మోస్తరు వర్షాలు

image

TG: మండుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఈనెల 6 నుంచి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా గూడపూర్‌లో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.

News May 2, 2024

ట్రాఫిక్ శబ్దంతో గుండె జబ్బుల ముప్పు: శాస్త్రవేత్తలు

image

ట్రాఫిక్ శబ్దం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని డెన్మార్క్, USA, స్విట్జర్లాండ్, జర్మనీ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. దీని వల్ల కార్డియోవాస్కులర్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా రాత్రి వేళ ఈ శబ్దం నిద్రకు భంగం కలిగిస్తుందని, దాని వల్ల పెరిగే ఒత్తిడి అధిక రక్తపోటు, గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. ప్రతి 10dBA ట్రాఫిక్ శబ్దానికి ఈ ప్రమాదం 3.2% పెరుగుతుందట.

News May 2, 2024

ఓటర్లకు బెదిరింపులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు

image

కర్ణాటకలో కాంగ్రెస్ MLA రాజు కాగే అలియాస్ భరమ్‌గౌడ అలగౌడ కాగే ఓటర్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెళగావి జిల్లాలోని మధభావిలో పర్యటిస్తున్న సందర్భంగా.. ‘ఈసారి మాకు ఎక్కువ ఓట్లు రాకుంటే మీ కరెంట్ కనెక్షన్లు తొలగిస్తా’ అని హెచ్చరించారు. మరో సందర్భంలో ‘మోదీ చనిపోతే ప్రధాని కావడానికి 140కోట్లలో ఎవరూ లేరా’ అని నోరుజారారు. కాగా ఓటర్లను బెదిరించడంపై ఈసీ నోటీసులు జారీ చేసింది.

News May 2, 2024

ఇంగ్లండ్ క్రికెటర్‌కు గుండె జబ్బు.. 23 ఏళ్లకే రిటైర్మెంట్

image

ఇంగ్లండ్ కౌంటీ క్రికెటర్ బెన్ వెల్స్ 23 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. అతను అరిథమిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతి(AVRC)తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు పరిగెత్తడం, వ్యాయామం లాంటి శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్‌బై చెప్పారు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన వెల్స్ 2021 నుంచి 9 టీ20లు, ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్-A మ్యాచ్‌లు ఆడారు.

News May 2, 2024

ATMలో కొత్త మోసం!

image

ATMలో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ లేని ATMలో CC కెమెరాలకు స్ప్రే చల్లి మెషిన్‌లోని కార్డు రీడర్ తొలగిస్తారు. కస్టమర్ కార్డు పెట్టగానే ఇరుక్కుపోతుంది. పిన్ ఎంటర్ చేస్తే కార్డు బయటకు వస్తుందని నమ్మిస్తారు. కానీ కార్డు రాకపోవటంతో బ్యాంకుకు వెళ్లాలని సూచిస్తారు. కస్టమర్ వెళ్లిపోగానే కేటుగాళ్లు పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసేస్తారు.

News May 2, 2024

ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు

image

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆయన భారత్‌లో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ రేవణ్ణకు నిన్న నోటీసులు ఇచ్చింది. తాను బెంగళూరులో లేనందున విచారణకు రాలేనని, వారం రోజులు సమయం కావాలని ప్రజ్వల్ ట్వీట్ చేశారు.

News May 2, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మోదీ క్లారిటీ ఇవ్వాలి: మంత్రి అమర్నాథ్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. త్వరలో అనకాపల్లికి వస్తోన్న ప్రధాని మోదీ.. ఈ అంశంపై బీజేపీ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు కూటమిని విశ్వసిస్తారన్నారు. కాగా ఈసారి గాజువాక అభివృద్ధి కోసం ప్రజల సూచనలతో లోకల్ మేనిఫెస్టోను తయారుచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

News May 2, 2024

యువరాజును ప్రధాని చేయడానికి పాక్ తహతహలాడుతోంది: మోదీ

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో PM మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘పాకిస్థాన్, కాంగ్రెస్ మధ్య బంధం బయటపడింది. మైక్రోస్కోప్‌లో వెతికినా దేశంలో కాంగ్రెస్ కనబడట్లేదు. యువరాజు ప్రధాని కావాలని పాక్ నేతలు ప్రార్థనలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారో దానిని మీ హయాంలో జమ్మూకశ్మీర్‌లో ఎందుకు అమలు చేయలేదు’ అని ప్రశ్నించారు.

News May 2, 2024

రూ.2వేల కోట్ల నగదు పట్టివేత

image

AP: అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం రూ.2 వేల కోట్లను కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి తీసుకెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరెన్సీ తరలింపు రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు.

News May 2, 2024

ట్రంప్ vs బైడెన్.. నిపుణులు ఏమంటున్నారంటే?

image

డొనాల్డ్ ట్రంప్‌కు మహిళల మద్దతు పెరిగిందంటున్నారు ప్రముఖ విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్. ‘జాతీయ పోలింగ్ సగటులో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ 1.5% ముందంజలో ఉన్నారు. లీగల్ ట్రబుల్స్ ప్రభావం అంతగా లేదు. నల్లజాతి విద్యావంతుల్లో ఆదరణ పెరిగింది’ అని తెలిపారు. చివరి 10 ఎన్నికల్లో 9సార్లు ఆయన జోస్యం ఫలించింది. 13 అంశాల ఆధారంగా గెలుపోటముల్ని అంచనా వేసే అలన్‌ను US అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌‌గా పేర్కొంటారు.