News September 19, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అటు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News October 3, 2024

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త‌

image

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. 78 రోజుల బోన‌స్ ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం రైల్వే శాఖ‌లో ప‌నిచేస్తున్న సుమారు 11.72 ల‌క్ష‌ల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల‌కు ప‌నితీరు ఆధారిత (Productivity Linked Bonus) బోన‌స్‌ ల‌భించ‌నుంది. అర్హత ఉన్న ప్ర‌తి రైల్వే ఉద్యోగికి 78 రోజులకుగానూ గ‌రిష్ఠంగా రూ.17,951 చెల్లించ‌నున్నారు.

News October 3, 2024

ఆ విషయంలో గాంధీ తరువాత మోదీనే: అమిత్ షా

image

గుజరాత్‌కు చెందిన ఇద్దరు పుత్రులు మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ మాత్రమే దేశ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత పౌరుల ఆరోగ్యం, ఆయుర్దాయం గురించి ఆందోళన చెందుతూ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎర్రకోట నుంచి మోదీ విజ్ఞ‌ప్తి చేశార‌న్నారు. గాంధీ తర్వాత పరిశుభ్రత ప్రాథమిక అవసరాన్ని వివరించిన 2వ జాతీయ నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.

News October 3, 2024

పవన్‌ను చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుంది: భూమన

image

AP: వైసీపీ చీఫ్ జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయ ప్రేలాపనలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నట్లుగా పవన స్వాముల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక వేరే అజెండా ఉందన్నారు. పవన్ స్వామిని చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.