news

News May 2, 2024

కొలన్ క్యాన్సర్.. ఈ లక్షణాలు గమనించండి

image

పెద్దపేగు క్యాన్సర్‌ను అవగాహన, ముందస్తు అప్రమత్తతతో అరికట్టవచ్చు. మలంలో రక్తం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాల్లో ఒకటిగా వైద్యులు తెలిపారు. ఆహారంలో తేడా, మరో కారణంతో రక్తం వచ్చిందని పొరబడకుండా పరీక్షలు చేయించుకోవాలని ఆంకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు అనుకోకుండా బరువు తగ్గడం, పొత్తి కడుపులో నొప్పి, జీవక్రియ అలవాట్లలో మార్పులు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు.
Share It

News May 2, 2024

అమ్మ కోరిక.. అందుకే ఎంగేజ్‌మెంట్ గురించి వెల్లడించా: అదితిరావు

image

ఇటీవల సిద్ధార్థ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్ అదితిరావు హైదరి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడానికి గల కారణాన్ని తెలిపారు. ‘నేను 400 ఏళ్ల నాటి రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నా. దీని గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది మా అమ్మకు ఫోన్లు చేశారు. ఆమె సమాధానం చెప్పలేక.. నువ్వే మీడియాకు వెల్లడించు అని చెప్పింది. దీంతో నేను, సిద్ధార్థ్ పోస్టులు పెట్టాం’ అని పేర్కొన్నారు.

News May 2, 2024

‘మోడల్’ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

image

తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు <>telanganams.cgg.gov.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10వ తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి ఏప్రిల్ 7న పరీక్ష జరిగింది. సీట్లు సాధించిన విద్యార్థుల జాబితాను మే 25న ప్రకటిస్తారు.

News May 2, 2024

2014, 19, 24 ఎన్నికలకు తేడా ఇదే: మోదీ

image

తాను 2014లో దేశ ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ప్రజల్లో చాలా సందేహాలున్నాయని PM మోదీ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు అనుభవం లేదనుకున్నారు. కానీ ఏదో ఒకటి చేస్తానని నమ్మారు. నేను పడ్డ శ్రమ, తీసుకున్న నిర్ణయాల వల్ల 2019 నాటికి ప్రజల్లో ఆ నమ్మకం మరింత బలపడింది. 2024 వచ్చేసరికి అది కాస్తా గ్యారంటీగా మారింది. ఈ పని నేను కచ్చితంగా చేస్తా అని చెప్పే స్థితికి వచ్చా’ అని పేర్కొన్నారు.

News May 2, 2024

సూపర్-6 నుంచి రూ.4వేల పెన్షన్ మాయం: పేర్ని నాని

image

AP: సీఎం జగన్‌కు వస్తోన్న ప్రజాదరణ చూసి కూటమి నేతలు మాయమాటలతో మేనిఫెస్టో రూపొందించారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మేనిఫెస్టోలో మోదీ ఫొటో, ఇవాళ కొన్ని పేపర్ ప్రకటనల్లో పవన్ కళ్యాణ్ ఫొటోలను తీసేశారని చెప్పారు. గతంలో సూపర్-6లో పెన్షన్ రూ.4వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు దాన్ని కనపడకుండా చేశారని మండిపడ్డారు. ఇలా ఫొటోలతో పాటు పథకాలు కూడా మాయమవుతాయని ఎద్దేవా చేశారు.

News May 2, 2024

వామ్మో.. 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

AP: రాష్ట్రంలో ఇవాళ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తించాయి. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1, మార్కాపురంలో 47, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7, మొత్తం 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, 188 మండలాల్లో వడగాలులు వీచాయి. రేపు, ఎల్లుండి అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే మండలాల జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News May 2, 2024

పాండ్యకు రీప్లేస్‌మెంట్ లేదు: అగార్కర్

image

టీమ్‌ఇండియాలో హార్దిక్ పాండ్యకు రీప్లేస్‌మెంట్ లేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. ఐపీఎల్‌లో ఫామ్‌లో లేని హార్దిక్‌ను WC జట్టుకు సెలక్ట్ చేయడం, వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై వివరణ ఇచ్చారు. ‘హార్దిక్ జట్టుకు బ్యాలన్స్ తీసుకొస్తాడు. ఫిట్‌గా ఉంటే అతడు ఏం చేయగలడో దానికి ప్రత్యామ్నాయం లేదు. హార్దిక్ బౌలింగ్ వేయడం వల్ల ఆప్షన్స్ పెరుగుతాయి’ అని తెలిపారు. వైస్ కెప్టెన్సీ గురించి తాము చర్చించలేదన్నారు.

News May 2, 2024

రేపు 3 సెగ్మెంట్లలో సీఎం జగన్ ప్రచారం

image

AP: సీఎం, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని పున:ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు నరసాపురం, మధ్యాహ్నం 12.30 గంటలకు క్రోసూరు, మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరి పామూరు బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు. కాగా ఇవాళ ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన ఆయన.. రీజినల్ కోఆర్టినేటర్లతో కీలక అంశాలపై చర్చించారు.

News May 2, 2024

కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

image

కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న ప్రకటనతో మిగతా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. దీంతో కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ ప్రకటన చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే కోవాగ్జిన్‌ను విడుదల చేశామంది. తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వెల్లడించింది.

News May 2, 2024

ఎల్లుండి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ నిలిపివేస్తాం: నెట్‌వర్క్ ఆస్పత్రులు

image

AP: ఆరోగ్యశ్రీ కింద మే 4 నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ రాశాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై అధికార వర్గాలు స్పందించాల్సి ఉంది.