India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల్లో యూరినరీ సమస్యలు (UTI) ఇంట్లోని ఫ్రిజ్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని US అధ్యయనం అంచనా వేసింది. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎస్చెరిచియా కోలై (E-Coli) అనే బ్యాక్టీరియా ఏర్పడి అది ఇతర పదార్థాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో UTI సమస్యలు వస్తున్నట్టు అంచనా వేసింది. ఇంట్లోని ఫ్రిజ్‌ను తరచుగా శుభ్రం చేయడం మహిళల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఫోలిక్ యాసిడ్ మన శరీరానికి చాలా కీలకం. ప్రధానంగా గర్భిణుల్లో ఇది అత్యవసరం. కొన్ని వంటకాల్లో సహజంగా ఫోలిక్ యాసిడ్‌ను సహజంగా పొందవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవి: పాలకూర, పన్నీర్, శనగలు, సాంబారు, రాజ్మా, మెంతికూర. వీటిలో సహజంగా ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు లభిస్తాయని వివరిస్తున్నారు. అయితే, గర్భిణులు ముందుగా వైద్యుల సలహాను తీసుకున్న తర్వాత వీటిని తినాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అటు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
టీమ్ ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని కొనియాడారు. ‘అలాంటి ఆటగాడు జట్టులో ఉండటమే ఓ గౌరవం. కేవలం ప్రదర్శన చేయడమే కాదు. బాగా ఆడాలన్న ఆకలి, కసి అతడిలో కనిపిస్తుంటాయి. ఆటలో ఏ సమయంలోనైనా వచ్చి ప్రభావం చూపించగల సామర్థ్యం బుమ్రా సొంతం’ అని పేర్కొన్నారు.
ఉద్యోగాల పేరుతో గంటల తరబడి యువకులు ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. అయితే, ఇది ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశ్రాంతి తీసుకోకుండా ల్యాప్‌టాప్ వినియోగించడం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మీ ఒడిలో ల్యాప్‌టాప్, మొబైల్స్ పెట్టుకొని వాడటం వల్ల మరింత హానికరమని తెలిపారు. ఇవి విద్యుదయస్కాంత క్షేత్రాలను విడుదల చేయడం వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుందని చెప్పారు.
TG: త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి ముగ్గు పోస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో 53శాతం ఇళ్లకు మంచినీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని, వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామని వరంగల్‌లో అన్నారు.
AP:YCPలో జరిగిన అవమానాలకు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏ పదవులు ఆశించడం లేదు. పవన్ రమ్మన్నారు. జనసేనలో చేరుతున్నా. జగన్ కోసం నా సొంత ఆస్తులు పోగొట్టుకున్నా. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా YCPని వీడలేదు. ఏ ఒక్క సమావేశంలోనూ జగన్ నా గురించి మంచిగా మాట్లాడలేదు. పదవుల కంటే గౌరవం ముఖ్యం’ అని ఆయన తెలిపారు.
బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) అద్భుత శతకంతో చెలరేగారు. రోహిత్, కోహ్లీ, గిల్ వంటి హేమాహేమీలు పరుగులు చేయలేక ఆపసోపాలు పడ్డ పిచ్‌పైనే సెంచరీ బాది ఔరా అనిపించారు. బంగ్లా బౌలర్ మొహమూద్ అందరినీ ఇబ్బంది పెట్టినా.. అశ్విన్ మాత్రం అతడినే ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.
బంగ్లాదేశ్‌తో ఈరోజు ఉదయం టెస్టు మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ బంగ్లాదేశ్’ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బంగ్లా అల్లర్లలో హిందువులపై ఘోరంగా దాడులు జరిగాయని, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాక్ తరహాలోనే ఆ దేశంతో కూడా క్రికెట్ ఆడకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే క్రీడల్ని, రాజకీయాల్ని ముడిపెట్టకూడదంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
భారత క్రికెటర్ రిషభ్ పంత్‌తో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నటి ఊర్వశీ రౌతేలా స్పష్టం చేశారు. ‘నేను నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉంది. పంత్ విషయంలో వచ్చినవన్నీ రూమర్లే. వాటిపై పారదర్శకత మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీమ్ పేజీలకు ఎందుకింత అత్యుత్సాహమో నాకు అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.