news

News May 3, 2024

YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

image

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు. ఇదే కేసులో అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది.

News May 3, 2024

IPL: రియాన్ పరాగ్ అరుదైన ఘనత

image

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సీజన్‌లో 400కు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచారు. నిన్నటి మ్యాచులో అర్ధసెంచరీతో అదరగొట్టిన పరాగ్.. ఈ సీజన్‌లో 10 మ్యాచుల్లో 409 పరుగులు చేశారు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్‌లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నారు.

News May 3, 2024

వృద్ధులను చంపడమే వైసీపీ టార్గెట్: షర్మిల

image

AP: పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి నెలా కొంతమందిని చంపాలని టార్గెట్ పెట్టుకుందని ఆరోపించారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను YCP వంచించింది. వారికి రూ.22 వేల కోట్లు బకాయిపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఆదుకుంటుంది. వారు బానిసలుగా పని చేయాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

News May 3, 2024

తగ్గిన బంగారం ధరలు

image

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.540 తగ్గి రూ.71,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 తగ్గి రూ.65,750గా నమోదైంది. మరోవైపు సిల్వర్ రేట్ స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.83,600గా ఉంది.

News May 3, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News May 3, 2024

బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

image

బెంగాల్ రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళ, ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగం పేరిట ఆయన తనను లైంగికంగా వేధించారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె ఆరోపణల్ని బోస్ తోసిపుచ్చారు. ‘కల్పిత కథనాల్ని చూసి భయపడను. చివరికి సత్యమే గెలుస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటే వారిష్టం. రాష్ట్రంలో అవినీతి, హింసపై నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని స్పష్టం చేశారు.

News May 3, 2024

నితీశ్ నా ఫేవరెట్ ప్లేయర్‌గా మారుతున్నారు: వాట్సన్

image

నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో SRH జట్టును తెలుగు ఆటగాడు నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. టోర్నమెంట్‌లో అతడు తన ఫేవరెట్ ఆటగాడిగా మారుతున్నారని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నారు. ‘ఇంత చిన్నవయసులో ఒత్తిడిలో కూడా చాహల్, అశ్విన్ లాంటివారిపై ఆధిపత్యం చెలాయించడం చిన్న విషయం కాదు. నితీశ్ చాలా నాణ్యమైన షాట్స్ ఆడారు. కచ్చితంగా ప్రత్యేకమైన ఆటగాడు’ అని కొనియాడారు.

News May 3, 2024

స్మృతీపై పోటీ.. ఎవరీ కిషోరీ లాల్ శర్మ?

image

అమేథీలో కేంద్రమంత్రి, BJP అభ్యర్థి స్మృతీ ఇరానీకి పోటీగా కిషోరీ లాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. 4దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న కిషోరీ.. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన స్వస్థలం పంజాబ్‌లోని లుథియానా. సోనియా గాంధీ అందుబాటులో లేనప్పుడు రాయ్ బరేలీతో పాటు రాహుల్ పోటీ చేసి ఓడిన అమేథీ నియోజకవర్గాన్ని సైతం శర్మ పర్యవేక్షిస్తుంటారు. అప్పుడప్పుడు పర్యటనలు చేస్తుంటారు.

News May 3, 2024

హైదరాబాద్‌లోనే ఢిల్లీ పోలీసుల మకాం

image

అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పోలీసులు ఇక్కడే మకాం వేశారు. ఇవాళ మరో IPS అధికారి కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మార్ఫింగ్ వీడియో కేసు నిందితులను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అయితే వారి కంటే ముందే హైదరాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిని తీసుకెళ్లేవరకు ఢిల్లీ పోలీసులు ఇక్కడే ఉంటారని సమాచారం.

News May 3, 2024

సోనియా స్థానంలో రాహుల్ పోటీ.. గెలిచేనా?

image

లోక్‌సభ పోటీ నుంచి తప్పుకున్న సోనియా గాంధీ.. రాజ్యసభ MPగా నామినేట్ అయ్యారు. దీంతో ఆమె ఇన్నాళ్లూ పోటీ చేసిన రాయ్‌బరేలీ నుంచి సోనియా తనయుడు రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నారు. 2004 నుంచి సోనియా రాయ్‌బరేలీలో ఓటమి ఎరుగని నేతగా ఉంటున్నారు. దీంతో సోనియా కంచుకోటను పదిలంగా కాపాడుకోవడం రాహుల్‌పై ఉన్న అతిపెద్ద బాధ్యత. ఆయన వయనాడ్ నుంచీ పోటీ చేయగా 2 చోట్లా గెలిస్తే ఏ సీటు వదులుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది.